న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా లాక్‌డౌన్.. స్టార్ క్రికెటర్ల వివాహాలు వాయిదా

Vidarbha’s Ranji Trophy winners postpone their marriage due to Coronavirus outbreak

నాగ్‌పూర్: కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచమే ఆగిపోయింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో క్రీడా టోర్నీలు రద్దవ్వడమో.. వాయిపడటమో జరిగింది. భారత అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కూడా నిరవధికంగా వాయిదాపడింది.ఆటలే కాదు.. ఎంతో మంది వివాహాలు వాయిదా పడ్డాయి. దీనికి క్రికెటర్లు కూడా మినహాయింపు కాదు. ఇటీవ‌లి కాలంలో దేశ‌వాళీ క్రికెట్‌లో ఇర‌గ‌దీస్తున్న విద‌ర్భ యువ ఆట‌గాళ్లు.. క‌రోనా కార‌ణంగా త‌మ పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకున్నారు. ఆల్‌రౌండ‌ర్ ఆదిత్య స‌ర్వ‌తే, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ అక్ష‌య్ వాడ్క‌ర్‌, పేస్‌బౌల‌ర్ ర‌జ‌నీశ్ గుర్బానీ.. ఈ ముగ్గురు ఆట‌గాళ్లు ఈ ఏడాది వేస‌విలో పెళ్లి చేసుకోవాని నిర్ణ‌యించుకున్నారు. అయితే క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో శుభ‌కార్యాల‌ను ప‌క్క‌న పెట్టి ఆరోగ్యానికి అధిక‌ప్రాధాన్య‌త ఇవ్వాల‌నుకున్న ఈ ముగ్గురు వివాహాల‌ను వాయిదా వేసుకున్నారు.

ఆటలే కాదు.. వివాహాలు వాయిదా..

ఆటలే కాదు.. వివాహాలు వాయిదా..

ఈ నెల 27న త‌న ప్రేయ‌సి అరుణిత‌తో ఆదిత్య పెళ్లి కావాల్సి ఉండ‌గా.. శృతిక‌తో వ‌చ్చే నెల 2న వాడ్క‌ర్ వివాహం జ‌రుగాల్సిఉంది. ఇక పేస్ గుర్రం గుర్బానీ పెళ్లి కూడా మే 18న జ‌రుపాల‌ని నిశ్చ‌యించారు. వివాహ వేడుకల‌ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్న త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో శుభ‌కార్యాల‌కు ఇది త‌గిన స‌మ‌యం కాద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వారు తెలిపారు.

 వెయిట్ చేస్తాం..

వెయిట్ చేస్తాం..

‘జూన్ 30 వరకు వేచి ఉండగలం. ఎందుకంటే లాక్‌డౌన్ ముగిసే వరకు ఎదురు చూడటం తప్పా మాకు మరో ఆఫ్షన్ లేదు. నాకు కాబోయే సతీమణి శృతిక కూడా సంప్రదాయబద్దంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగాలని కోరుకుంటుంది. కాబట్టి మరికొద్ది రోజులు వెయిట్ చేస్తాం'అని అక్షయ్ వాడ్కర్ తెలిపాడు. శృతికా కూడా ఇదే విషయాన్ని చెప్పింది. తమ వివాహానికి సంబంధించిన షాపింగ్ మొత్తం పూర్తి అయిందని.. ఇక పెళ్లి జరిగే తేదీ గురించి ఎదురుచూస్తున్నామని పేర్కొంది.

లాక్‌డౌన్ పొడిగించడంతో..

లాక్‌డౌన్ పొడిగించడంతో..

‘నా వివాహం ఏప్రిల్ 27 న జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ పొడిగించడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. పంతులు అందుబాటులో లేని కారణంగా కొత్త తేదీని ఇంకా ఖరారు చేయలేదు, "అని ఆదిత్య సర్వతే చెప్పుకొచ్చాడు. అతని భార్య అరుణితా మాట్లాడుతూ.. ‘2018-19 రంజీ ట్రోఫీ ఫైనల్ అయిపోయిన వెంటనే వివాహం ఎలా చేసుకోవాలని ఆలోచించాం. నిడారంబరంగా పెళ్లి చేసుకోని, హనీమూన్‌కి వెళ్దామని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణం ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.'అని తెలిపింది. నాగ్‌పూర్‌ని రెడ్‌-జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో తమ కుమారుడి వివాహాన్ని వాయిదా వేశామని.. కుటుంబ పెద్దలతో దీనిపై చర్చించి పెళ్లి గురించి త్వరలో నిర్ణయం తీసుకంటామని రజనీశ్ గుర్బానీ తండ్రి తెలిపారు. ఇక రజనీశ్ మాట్లాడుతూ..‘పెళ్లి వాయిదా పడటంతో తదుపరి డేట్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. చూద్దాం.. నా పెళ్లి ఈ ఏడిదా జరుగుతుందో లేక వచ్చే ఏడాదో'అని రాజ్‌నీశ్ గుర్బానీ తెలిపాడు. ఇక 2017-18 రంజీ సీజన్‌లో గుర్బానీ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు.

 రంజీ చాంపియన్స్...

రంజీ చాంపియన్స్...

ఇక 2017-18, 2018-19 రంజీట్రోఫీలను సొంతం చేసుకున్న విదర్భ జట్టులో ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఇక వరుసగా రెండు సార్లు టైటిల్ సాధించిన విదర్భ 2019-20 సీజన్‌లో మాత్రం ఫైనల్‌కు చేరలేకపోయింది. బెంగాల్‌తో జరిగిన టైటిల్ ఫైట్‌లో సౌరాష్ట్ర విజయం సాధించి ఈ సీజన్ చాంపియన్‌గా నిలిచింది.

Story first published: Wednesday, April 22, 2020, 9:50 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X