న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి మరణంతో నా గుండె బద్దలవుతోంది .. మహిళా క్రికెటర్ భావోద్వేగం!

Veda Krishnamurthys Emotional Post After Losing Mother, Sister To COVID-19

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా రెండు వారాల వ్యవధిలో అమ్మను, అక్కను కోల్పోవడం తీరని బాధను మిగిల్చిందని భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు లేకపోవడం వల్ల తన హృదయం ముక్కలవుతోందని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురైంది. వాళ్లతో చివరి రోజుల్లో సంతోషంగా గడిపానని, కానీ అవే ఆఖరి క్షణాలు అవుతాయని అనుకోలేదని పేర్కొంది. తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ వైరస్ తన తల్లి, అక్కను బలితీసుకుందని తెలిపింది.

వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబా గత నెల 23న కరోనాతో మృతి చెందగా.. ఆమె అక్క వత్సల కూడా మహమ్మారి కారణంగానే మే 6న కన్నుమూశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో వేద కృష్ణమూర్తి అమ్మ, అక్కతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సోమవారం ట్విటర్‌ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

గుండె తరుక్కుపోతుంది..

'అందమైన అమ్మ, అక్క.. ఇంట్లోని మేమందరం గత కొన్ని రోజులుగా దుఃఖంలో మునిగిపోయాం. మన ఇంటికి మీ ఇద్దరే పునాది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మీరు నాతో లేరని తెలిసి నా హృదయం ముక్కలవుతోంది. అమ్మా.. నువ్వు నన్ను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దావు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేర్పావు. ఆ లక్షణాన్ని నాకు అందించింది కచ్చితంగా నువ్వే.

నాకెప్పటికీ తెలిసిన అందమైన, ఆనందమైన, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన చెల్లిని నేనని నాకు తెలుసు. నువ్వొక యోధురాలివి. చివరి నిమిషం దాకా ఎలా పోరాడాలో నాకు నేర్పించావు.

నా ప్రతి మాటలో..

నా ప్రతి మాటలో..

మీరిద్దరూ.. నా ప్రతిమాటలో.. నేను చేసే ప్రతిపనిలో సంతోషం వెదుక్కునే వారు. మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదని ఇప్పుడు తెలుస్తోంది. మీతో చివరి రోజులను ఎంతో సంతోషంగా గడిపా. కానీ అవే ఆఖరి క్షణాలు అవుతాయని అనుకోలేదు. మీరిద్దరు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిన తర్వాత నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో అంతే మిస్సవుతున్నాను కూడా.. నాకింతటి ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు.

వైరస్ చాలా డేంజర్..

వైరస్ చాలా డేంజర్..

నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే మనస్సు తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి''అని వేద విజ్ఞప్తి చేశారు. కాగా బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్‌ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడి.. 829, 875 పరుగులు చేసింది.

Story first published: Tuesday, May 11, 2021, 14:03 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X