న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంచుమించు ఒకేలా: కోహ్లీ రికార్డులకు రోహిత్ శర్మకు పెద్ద తేడా లేదు

Unstoppable Rohit Sharma has finally caught up with Virat Kohli in 2017

మాంచి దూకుడు మీదున్న రోహిత్ శర్మ మొత్తానికి విరాట్ కోహ్లీ 2017 రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 26 వన్డే మ్యాచ్‌ల్లో 1460 పరుగులు తీస్తే.. రోహిత్ 20 వన్డే మ్యాచ్ ల్లోనే 1286 పరుగులు తీశాడు. ఈ మ్యాచ్ లకు గాను కోహ్లీ యావరేజ్ 76.84 ఉంటే, రోహిత్ 75.64గా ఉంది. ఇది ఇలానే కొనసాగితే విరాట్ కోహ్లీ రికార్డులను ఒక సంవత్సరంలో దాటినా ఆశ్చపడనక్కర్లేదు.

బుధవారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో మూడో డబుల్ సెంచరీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ 141 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. కెప్టెన్ గా విజయం పొందడమే గాక డబుల్ సెంచరీ చేసిన ఉత్సాహంలోనూ రోహిత్ శర్మ ఉన్నాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం "141 పరుగుల ఆధిక్యంలో గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఒక కెప్టెన్ గానే కాదు. క్రికెటర్ గా కూడా మూడో డబుల్ సెంచరీ చేయడం నాకు చాలా గొప్ప విషయం. " అన్నాడు.

30 సంవత్సరాల ఈ ముంబై బ్యాట్స్ మాన్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య యావరేజ్ ను లెక్కిస్తే కేవలం 1.2 పరుగుల తేడా మాత్రమే ఉంది. కోహ్లీ మ్యాచ్ చివర్లో గానీ లేదా మొదట్లో గానీ చేసే స్కోరును రోహిత్ శర్మ మ్యచ్ మొదలైనప్పటి నుంచి ఒకేలాగా ఆడి బాదిపడేశాడు.

వీరిద్దరిని పోల్చి చూస్తే, ఒకటర్థమవుతుంది. వీళ్ల జీవితాలు 2012 ఆఖరు వరకు ఒకలా ఉంటే, 2013 మొదటి నుంచి ఒకలాగా ఉన్నాయి.

2012కు ముందు..
2012కు ముందు దాదాపు అయిదేళ్లు రోహిత్ 86 మ్యాచ్‌ల్లో 29.73 యావరేజ్‌తో ఆడాడు. వాటిల్లో స్కోరు 1978గా ఉంటే, రెండు సెంచరీలు, 11హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అంతే సమయంలో కోహ్లీ 91 మ్యాచ్‌ల్లో 49.87 యావరేజ్‌తో దూసుకుపోయాడు. వాటిల్లో స్కోరు 3886 గా ఉంటే, 13సెంచరీలు, 21హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2013తర్వాత..
అంతకుముందుకు భిన్నంగా రోహిత్ 87 మ్యాచ్‌లలో 4439 పరుగులు తీశాడు. వీటి యావరేజ్ 58375. అయితే సంవత్సరం తర్వాత నుంచి కోహ్లీ కెప్టెన్‌గా ఉండటంతో 111 మ్యాచ్‌లు ఆడి 5144 పరుగుల స్కోరును సంపాదించుకున్నాడు. వీటి యావరేజ్ 63.44. కానీ, రోహిత్ శర్మ తిరుగులేని రికార్డును గెలుచుకుని 2013 నుంచి మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఈ తరహా రికార్డులను నమోదు చేసి తమ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అజేయంగా దూసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ 2013తర్వాత మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడనే చెప్పాలి.

కోహ్లీ 2016లో రెచ్చిపోయాడు. క్రికెట్ మైదానాన్ని ఉరకలు పెట్టించాడు. ఆ ఏడాది ఆడిన పది మ్యాచ్‌లలో తన యావరేజ్ 92.37. అయినప్పటికీ, రోహిత్ కూడా అదే పది మ్యాచ్‌లు ఆడి తన యావరేజ్‌ను 62.66 గా నమోదు చేశాడు. రోహిత్ రికార్డులు కోహ్లీకి ఎంత చేరువలో ఉన్నాయనేది దీని ద్వారానే చెప్పొచ్చు.

ఇప్పటివరకు ప్రత్యర్థులు కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. కోహ్లీని అధిగమించాలని పథకం వేసుకుని మరీ కాసుకు చూస్తారో అలాంటిదే రోహిత్ శర్మపై కూడా ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ, సమాన సామర్థ్యం ఉన్న రోహిత్ కూడా ఇదే స్థాయిలో రాణిస్తే అతని కెరీర్ కూడా వెలిగిపోతుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 17:14 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X