'అంపైర్‌ కాల్' రద్దు చేయబడుతుందా? ఎంసీసీ సమావేశంలో గంగూలీ, పాంటింగ్, సంగక్కర ఏం చెప్పారు!

లండన్‌: 'అంపైర్‌ కాల్‌' మరోసారి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ నిబంధన కారణంగా కొందరు ఆటగాళ్లు బతికిపోగా.. మరికొందరు బలయ్యారు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అవ్వగా.. ఇంగ్లండ్ సారథి జో రూట్ బతికిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగింది. అంపైర్‌ కాల్ నిబంధనను రద్దు చేయండని నెటిజన్ల నుంచి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్‌​ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంపైర్‌ కాల్ అంటే:

అంపైర్‌ కాల్ అంటే:

2016లో ఐసీసీ ప్రవేశపెట్టిన అంపైర్‌ కాల్ నిబంధన ఆన్‌-ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. బ్యాట్స్‌మన్‌ ఔట్‌ లేదా నాటౌట్‌ విషయంలో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలిపెట్టడమే అంపైర్‌ కాల్‌. ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్‌ డెసిషన్‌పైనే రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడతాడు. కొన్నిసార్లు ఇది సరైన నిబంధనే అనిపించినా.. చాలా సందర్భాల్లో అంపైర్స్‌ కాల్‌ వివాదాలకు దారి తీసింది.

కోహ్లీ ఔట్:

కోహ్లీ ఔట్:

రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. మొదటగా అలీ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ వేలెత్తేశాడు. కోహ్లీ సమీక్షకు వెళ్లగా.. అంపైర్‌ కాల్‌ నిబంధన కారణంగా అతడు ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జో రూట్‌ క్యాచ్‌ ఔట్‌ అంటూ భారత్‌ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ నిరాకరించాడు. రూట్‌ ఔట్ విషయంపై పెద్ద దుమారం చెలరేగింది.‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ తీసుకున్న నిర్ణయంతో భారత్‌ తీవ్ర నిరాశకు గురైంది.

బతికిపోయిన రూట్:

బతికిపోయిన రూట్:

అక్షర్‌ వేసిన బాల్‌ను రూట్‌ ఎదుర్కోగా అది నేరుగా కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే అది రూట్‌ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్‌ అప్పీల్‌ చేసింది. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత కెప్టెన్‌ కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. రీప్లేలో భాగంగా బంతి రూట్‌ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా.. ఎక్కడా ఎడ్జ్‌ అవ్వలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్‌ ఉందేమోనని థర్డ్‌ ఎంపైర్‌ మరోసారి పరిశీలించగా.. ప్యాడ్లు తాకుతూ ఆఫ్‌స్టంప్‌ మీదుగా బంతి వెళ్లినట్లు కనిపించింది. దీంతో ఔట్ అని రిప్లేలో స్పష్టమైంది. కానీ బంతి ప్రభావం ఆఫ్‌ స్టంప్‌పై ఉండటంతో ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే థర్డ్‌ అంపైర్‌ అప్పచెప్పాడు. దాంతో తొలుత నాటౌట్‌ నిర్ణయానికే ఫీల్డ్‌ అంపైర్‌ కట్టుబట్టాడు. దాంతో రూట్‌ బతికిపోయాడు. ఈ నేపథ్యంలో అంపైర్‌ కాల్ నిబంధన‌కు స్వస్తి పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

 ఎంసీసీ సమావేశంలో కీలక నిర్ణయం:

ఎంసీసీ సమావేశంలో కీలక నిర్ణయం:

క్రికెట్‌ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్‌​ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజా సమావేశంలో అంపైర్‌ కాల్ నిబంధనపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ​రికీ పాంటింగ్‌, శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర, ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తదితరులతో కూడిన కమిటీ తమ ఎజెండాలో భాగంగా.. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్‌ కాల్‌ నిబంధనను రద్దు చేసేందుకు సముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ప్రస్తుత విధానంతో వారు సంతృప్తిగానే ఉన్నారని తెలిసింది. అయితే కమిటీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఐసీసీకి ఎంసీసీ పంపనుంది. ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ ఆటగాడు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, February 23, 2021, 20:56 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X