న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొవ్వెక్కడుందో చూపించాలని ట్రైనర్‌తో పాకిస్థాన్ క్రికెటర్ వాగ్వాదం!!

Umar Akmal faces sanctions for misbehaving during fitness test

కరాచీ: పాకిస్థాన్ ఔట్ ఆఫ్ ఫేవర్ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైన అతను అసహనంతో ట్రైనర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనకు కొవ్వెక్కడుందో చూపించాలంటూ అతిగా ప్రవర్తించాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెద్దల దృష్టికి వెళ్లడంతో ఉమర్ అక్మల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా అక్మల్‌ను నిషేధించే అవకాశాలున్నాయి.

పాకిస్థాన్ జట్టును విజయాల బాట పట్టించాలనే లక్ష్యంతో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మిస్బావుల్ హక్.. ముందుగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. డొమెస్టిక్ క్రికెట్లో సైతం ఆటగాళ్లకు ప్రతీ మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. ఈ క‍్రమంలోనే ఉమర్‌ అక్మల్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహించగా విఫలమయ్యాడు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)‌లో ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహించే ట్రైనర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చొక్కా విప్పి మరీ తన కొవ్వును చూపించమని అతిగా ప్రవర్తించాడు. మికీ ఆర్థర్‌ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్‌ అక్మల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల్లో విఫలమయ్యాడు. అప్పుడు కూడా ఆర్థర్‌పై ఉమర్ నోరు పారేసుకున్నాడు.

శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

ఇక తన సోదరుడు కమ్రాన్ అక్మల్ సైతం ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. కమ్రాన్ సైతం రెండు ఫిట్‌నెస్ టెస్ట్‌లను స్కిప్ చేసి మూడోదానికి హాజరయ్యాడు. ఇక తన సోదరుడు ఉమర్ అక్మల్ సంబంధించిన ఘటన గురించి మాట్లాడుతూ ఎన్‌సీఏ అపార్థం చేసుకుందని తెలిపాడు.

ఇక ఉమర్ అక్మల్ 2009లో న్యూజిలాండ్‌తో తన అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీతో రాణించాడు. అనంతరం పూర్ ఫామ్‌, ఫిట్‌నెస్‌తో ఇబ్బందిపడ్డ అతను సర్ఫరాజ్ అహ్మద్ రాకతో జట్టులో చోటుకోల్పోయాడు.

వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)

మొత్తం 16 టెస్ట్‌లు ఆడిన ఉమర్ ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 1003 పరుగులు చేశాడు. ఇక 121 వన్డేల్లో 2 సెంచరీలతో 3194 పరుగులు, 84 టీ20ల్లో 8 హాఫ్ సెంచరీలతో 1690 రన్స్ నమోదు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్ వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌లతో విమర్శల పాలై జట్టుకు దూరమయ్యాడు.

Story first published: Monday, February 3, 2020, 15:27 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X