న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U19 World Cup Final:యువభారత్ తడ‘బ్యాట్’.. బంగ్లా లక్ష్యం 178

U19 World Cup Final: India collapse from 156 for 3 to 177 all out

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 178 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మరో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(38), ప్రియమ్ గార్గ్(22) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. దీంతో 47.2 ఓవర్లలో భారత్ 177 పరుగులకే ఆలౌటైంది.

బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్(3/40), షోరిఫుల్ ఇస్లామ్(2/31), తజీమ్ హసన్ (2/28)లు భారత్ పతనాన్ని శాసించగా.. రకిబుల్ హసన్ ఒక వికెట్ తీశాడు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మన్ రనౌట్‌గా వెనుదిరిగడం విశేషం.

<strong>ఓడామనే బాధలేదు.. మూడో వన్డేలో మార్పులుంటాయి: కోహ్లీ</strong>ఓడామనే బాధలేదు.. మూడో వన్డేలో మార్పులుంటాయి: కోహ్లీ

యశస్వీ ఒక్కడే..

యశస్వీ ఒక్కడే..

టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తుదిసమరంలోను అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తించే బంతులతో విరుచుకుపడినా సహనంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలోనే సహచర ఓపెనర్ దివ్యాన్ష్ సక్సెనా వికెట్ కోల్పోయినా క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో బాధ్యాతాయుతంగా ఆడిన జైస్వాల్.. కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.

6 ఓవర్లు 8 పరుగులు..

6 ఓవర్లు 8 పరుగులు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో ఆతిథ్య పేసర్లు చెలరేగారు. దీంతో భారత ఓపెనర్లు తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేశారు. అనంతరం మూడో ఓవర్‌లో కూడా పరుగులు రాకపోవడంతో భారత్ 6 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 పరుగులే చేసింది. ఇక ఏడో ఓవర్‌లో దివ్యాన్ష్ ఔటవ్వగా.. మరుసటి ఓవర్‌లో యశస్వీ బౌండరీల ఖాతా తెరిచాడు.

ఆ వెంటనే సింగిల్ తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి తిలక్‌ మోకాలి తగలడంతో మైదానంలో కుప్పకూలాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ చేయడంతో బ్యాటింగ్‌కు సిద్దమైన తిలక్ పరుగు తీయడంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే ముసిగే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

కీలక భాగస్వామ్యం..

కీలక భాగస్వామ్యం..

బంగ్లా బౌలర్లను ఆచితూచిగా ఎదుర్కొన్న జైస్వాల్-తిలక్ నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీలకు తరలిచింది. 16 ఓవర్లో చెరొక ఫోర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. మరికొన్ని ఓవర్లపాటు నిదానంగా ఆడిన జోడీ రన్ రేట్ తగ్గకుండా సింగిల్స్ తీస్తూ జాగ్రత్తపడింది. ఈ క్రమంలో హసన్ షకీబ్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన యశస్వి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ టోర్నీలో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషమైతే.. ప్రతీ మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేయడం మరో విశేషం. మొత్తం 6 ఇన్నింగ్స్‌ల్లో 88,105, 62,57 నాటౌట్, 29 నాటౌట్, 57, పరుగులు చేయడం గమనార్హం.

ఆ వెంటనే యశస్వీ ఓ భారీ సిక్సర్‌ కొట్టగా.. భారీ షాట్‌కు ప్రయత్నించిన తిలక్ వర్మ(38) బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ధృవ్ జురేల్ క్రీజులోకి రాగా.. యశస్వీ ఆచితూచి ఆడాడు.

యశస్వీ ఔట్.. టపటపా..

యశస్వీ ఔట్.. టపటపా..

42 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఫామ్ కనబర్చిన యశస్వీ-ధృవ్ జోడీని షోరిఫుట్ విడదీసాడు. వరుస బంతుల్లో యశస్వీ, సిద్దేశ్‌లను పెవిలియన్ చేర్చి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.

యశస్వీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరగా.. సిద్ధేశ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే అంకోలేకర్‌తో సమన్వయ లోపంతో ధృవ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.

ఆ వెంటనే రవి బిష్టోయ్(2), అంకోలేకర్(3), సుశాంత్ మిశ్రా(3), కార్తీక్ త్యాగి(0) వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. యశస్వి ఔటైన అనంతరం 21 పరుగుల వ్యవధిలోనే భారత్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.

Story first published: Sunday, February 9, 2020, 19:23 [IST]
Other articles published on Feb 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X