న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా క్రికెట్‌లో సంచలనం.. ప్రపంచకప్ గెలిచిన భారత్

U19 Women’s T20 World Cup: India win ICC World CUP after BEAT England by 7 wickets in Final

పాచెఫ్‌స్టూమ్(సౌతాఫ్రికా): భారత మహిళల క్రికెట్‌లో సంచలన విజయం నమోదైంది. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను భారత మహిళల అండర్-19 టీమ్ గెలిచి చరిత్ర సృష్టించింది. సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ.. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లోనే అద్భుత విజయాన్నందుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత అండర్19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.

సీనియర్ మహిళల టీమ్ మూడు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయింది. కానీ షెఫాలీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లు టిటాస్ సధు, అర్చనా దేవి, పర్షావి చోప్రా రెండేసి వికెట్లు తీయగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ర్యానా మాక్‌డోనాల్డ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం విశేషం.


అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత అమ్మాయిలు 14 ఓవర్లలోనే 3 వికెట్లకు కోల్పోయి 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(15), శ్వేతా సెహ్రావత్(5) విఫలమైనా.. సౌమ్య తివారీ(24), తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిషా(24) రాణించి సంచలన విజయాన్నందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్ స్క్రీవెన్స్ తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన షెషాలీ సేన.. ఆస్ట్రేలియాతో మినహా ప్రతీ మ్యాచ్ గెలిచింది. సూపర్-6లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్ దశలో సౌతాఫ్రికా, యూఏఈ , స్కాట్లాండ్ టీమ్స్‌ను ఓడించిన భారత్.. సూపర్-6లో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్‌కు కొరకరాని కొయ్యగా ఉన్నన్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చారిత్రాత్మక విజయాన్నందుకున్న షెఫాలీ సేనకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

Story first published: Sunday, January 29, 2023, 20:01 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X