న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్షా భోగ్లే.. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అంత భయమెందుకు?

Twitter bashes Harsha Bhogle for deleting his ‘Nizamuddin’ tweet

హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సాముహిక ప్రార్ధనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రలను గజగజ వణికిస్తుంది. మార్చి నెలలో ఇక్కడ జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటీవ్ రావడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఇక తెలంగాణలో మరణించినవారు.. ఆంధ్రలో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఈ నిజాముద్దీన్ ప్రార్ధనల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం.

ఇక ఈ మతపరమైన ప్రార్ధనలలో పాల్గొన్న వారే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో నిజాముద్దీన్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజాముద్దీన్‌ వాసులను ఢిల్లీలోని వేర్వేరు ఆస్పత్రులకు బస్సుల్లో తరలించి వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని వెతికిపట్టుకొని పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేశాయి. ఇక సెలెబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేసి ఇరుకున పడ్డాడు. ఓ వర్గం ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.

'సమాజ శ్రేయస్సు కోసం రాబోయే కొన్ని వారాలు ఇంట్లోనే ఉందాం. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కలిసికట్టుగా అడ్డుకుంటే.. అది మనల్ని మరింత బలవంతులను చేస్తుంది. దయచేసి సామూహిక సమావేశాలకు దూరంగా ఉండండి. మనం మరో సమస్యను తట్టుకోలేం' అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. అయితే తొలుత.. ఈ ట్వీట్‌లో మనం మరో నిజాముద్దీన్ ఘటనను భరించలేం అని పేర్కొన్నాడు. మళ్లీ ఓ వర్గం నుంచి విమర్శలు వస్తాయనుకున్నాడో ఏమో కానీ ఆ ట్వీట్‌లో నిజాముద్దీన్ పదాన్ని తొలిగించాడు. మళ్లీ అతనే దానికి గల కారణాన్ని తెలియజేశాడు. 'నా ట్వీట్ ఒకరు వేలెత్తి చూపించేలా ఉందనిపించింది. అందుకే ఆ పదాన్ని తొలగించాను. నా ఉద్దేశం మరోసారి సాముహిక సమావేశాలు జరపవద్దని మాత్రమే. వాటిని ప్రజలు భరించలేరు'అని తెలపడమేనని ఇంకో ట్వీట్ చేశాడు. దీంతో హర్షా భోగ్లే తీరుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. అంత పిరికివాడివైతే క్రికెట్ కామెంట్రీ ఎలా చెప్తున్నావని నిలదీస్తున్నారు. మొత్తానికి ట్వీట్ చేయవద్దని, ఇంట్లో కూర్చోవాలని హితవు పలుకుతున్నారు.

Story first published: Wednesday, April 1, 2020, 14:45 [IST]
Other articles published on Apr 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X