న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ టోకెన్ గేమ్స్‌కు ఎవడన్నా వస్తాడా? బిజీ షెడ్యూల్‌పై క్లార్క్ ఫైర్! మండిపడ్డ బోల్ట్

Trent Boult slams Michael Clarke calling the Australia vs New Zealand 3-ODI home series is token games of cricket

అక్లాండ్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవ్వకముందే ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. తీరికలేని షెడ్యూల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మూడు వన్డేల సిరీస్‌ను టోకెన్ గేమ్స్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ అభివర్ణించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ కౌంటరిచ్చాడు.

ఈ మ్యాచ్‌లు ఎవడు చూస్తాడు..

ఈ మ్యాచ్‌లు ఎవడు చూస్తాడు..

ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడింది. భారత్‌తో 1-2, సౌతాఫ్రికాతో 0-3తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికాపైనే 2-1తో టీ20 సిరీస్ గెలిచింది. మార్చి 7నే సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న ఆసీస్.. 5 రోజుల గ్యాప్‌తోనే 13 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లను ఎవరు చూస్తారని ప్రశ్నించాడు. ఈ సిరీస్‌లో జరిగే మ్యాచ్‌లు టోకెన్ గేమ్స్ అని అభిప్రాయపడ్డాడు. ‘నేను క్రికెట్ అభిమానినే. వన్డే సిరీస్‌లు జరపడానికి ఇది అనువైన సీజన్ కాదు. మహిళల ప్రపంచకప్ గెలుపుతో క్రికెట్ సీజన్ ముగిసింది. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు జరిగాయి. మాకు ఇన్ని మ్యాచ్‌లు అవసరం లేదు.'అని క్లార్క్ బీజీ షెడ్యూల్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

ఫీల్డర్‌ విసిరిన బంతితో తీవ్రంగా గాయపడ్డ అంపైర్‌.. మ్యాచ్‌కు దూరం!

క్లార్క్ బాధ ఏందో..

క్లార్క్ బాధ ఏందో..

ఇక క్లార్క్ వ్యాఖ్యలను న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తప్పుబట్టాడు. రసవత్తకరమైన సిరీస్ అతనికి టోకెన్ గేమ్స్‌గా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదన్నాడు. అతని సమస్య ఏంటో తనకు తెలియదని, కానీ ఇరు జట్లకు ఇదో అద్బుతమైన సిరీస్ అని చెప్పుకొచ్చాడు. గెలుపు లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామన్నాడు.

స్లెడ్జింగ్ కూడా ఉండొచ్చు..

స్లెడ్జింగ్ కూడా ఉండొచ్చు..

ఇక ఈ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సిన మజా లభిస్తుందన్నాడు. ‘క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. న్యూజిలాండ్ కన్నా అక్కడి మైదానాలు పెద్దవి. ఈ సిరీస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌‌తో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది మాట్లాడే మాటల్లో అర్థమే లేదు'అని బోల్ట్ ఆస్ట్రేలియా బయల్దేరే ముందు ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడాడు. ఇక వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డే‌ల్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి.

Story first published: Tuesday, March 10, 2020, 20:53 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X