న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డర్‌ విసిరిన బంతితో తీవ్రంగా గాయపడ్డ అంపైర్‌.. మ్యాచ్‌కు దూరం!

On-field umpire C Shamshuddin ruled out after getting hit on abdomen in Ranji Trophy final 2020

రాజ్‌కోట్‌: ప్రతిష్టాత్మ రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ షంషుద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రెండో రోజు మైదానంలోకి రాని షంషుద్దీన్.. గాయం తీవ్రత కారణంగా మిగిలిన మూడు రోజుల మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. అతనికి వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలడంతో.. అతని స్థానంలో యశ్వంత్ బర్దే అంపైర్‌గా మూడో రోజు నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు.

 ఇంతకేం జరిగిందంటే..

ఇంతకేం జరిగిందంటే..

సోమవారం ప్రారంభమైన ఈ మెగా ఫైనల్ తొలి రోజు ఆటలో స్వ్కేర్‌ లెగ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న షంషుద్దీన్‌ ఫీల్డర్ విసిరిన బంతి తాకి గాయపడ్డాడు. సౌరాష్ట్ర వికెట్‌ కోల్పోయిన ఆనందంలో బెంగాల్ ఫీల్డర్‌ విసిరిన బంతి షంషుద్దీన్ పొట్టభాగంలో బలంగా తాకింది. దీంతో అతను మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతను మైదానం వీడగా.. టీవీ అంపైర్ రవి అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్నాడు. అదే సమయంలో గాయపడ్డ షంషుద్దీన్‌ టీవీ అంపైర్‌గా చేశాడు.

ఫస్ట్ సెషన్ అంతా ఒకే అంపైర్..

ఫస్ట్ సెషన్ అంతా ఒకే అంపైర్..

ఈ గాయంతో రెండో రోజు విధులు నిర్వర్తించడానికి షంషుద్దీన్‌ మైదానంలోకి రాలేదు. దీంతో ఫస్ట్ సెషన్ అంతా పద్మనాభన్‌నే ఓ స్థానిక అంపైర్ సాయంతో రెండు వైపుల బాధ్యతలు నిర్వర్తించాడు. షంషుద్దీన్ పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లగా.. టీవీ అంపైర్‌గా రవి మళ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో పియూష్ కక్కర్‌ అనే స్థానిక అంపైర్‌ను స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నిలబెట్టారు. అతను నామమాత్రమే కావడంతో ప్రధాన అంపైర్ అనంత పద్మనాభనే రెండు వైపుల చూసుకున్నాడు.

పియూష్ కక్కర్ అధికారిక అంపైర్ కాకపోవడంతో అతను నిర్ణయం తీసుకోలేడు. లెగ్ స్క్వేర్‌కు సంబంధించి అతను పద్మనాభన్‌కు చెబితే ప్రధాన అంపైర్‌గా తుది నిర్ణయం ప్రకటిస్తాడు. కానీ ఫస్ట్ సెషన్‌లో సౌరాష్ట్ర ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడంతో ఆ అవకాశం రాలేదు. పరీక్షల అనంతరం షంషుద్దీన్ తిరిగి రావడంతో అనంత పద్మనాభన్‌తో కలిసి రవి ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

సౌరాష్ట్ర 384/8

సౌరాష్ట్ర 384/8

అర్పిత్ సెంచరీ, పుజారా హాఫ్ సెంచరీలతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. క్రీజులో చిరాగ్ జాని(13 బ్యాటింగ్), ధర్మేంద్ర జడేజా (13 బ్యాటింగ్) ఉన్నారు. 206/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో సౌరాష్ట్ర రెండో రోజు ఆటను ప్రారంభించగా.. పుజారా-అర్పిత్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. బెంగాల్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట ఆరో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. దీంతో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Tuesday, March 10, 2020, 19:45 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X