న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ ఏడాది రోహిత్ శర్మ పీకిందేం లేదు? ఐపీఎల్‌తో సహా మూడు ఫార్మాట్లలో అట్టర్ ఫ్లాఫ్!

Ton-less Rohit Sharmas 2022 performance in ODIs, T20s, Tests and IPL

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2022 సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు. అతని కెరీర్‌లోనే ఈ ఏడాది దరిద్రపుగొట్టు సంవత్సరంగా మిగిలిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అచ్చొచ్చిన ఐపీఎల్‌లోనూ రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. తనదైన ఆటతో అసాధారణ రికార్డులు నమోదు చేసే రోహిత్.. ఈ సారి మాత్రం తన పేరిట చెత్త రికార్డులను లిఖించుకున్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022తో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అట్టడుగున నిలవడం రోహిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు.

9 ఏళ్లలో తొలిసారి..

9 ఏళ్లలో తొలిసారి..

ఈ రెండు పరాజయాలే కాకుండా.. ఈ ఏడాది రోహిత్ శర్మ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ సెంచరీ చేయకపోవడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి. 2013 నుంచి ప్రతీ ఏడాది కనీసం ఒక సెంచరీ చేస్తూ వస్తున్న రోహిత్.. ఆ రికార్డుకు ఈ ఏడాది ముగింపు పలికాడు. ఈ ఏడాది టెస్ట్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 46.

వన్డేల్లో 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 41.50 యావరేజ్‌తో 249 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 76 పరుగులు మాత్రమే. టీ20ల్లో 29 ఇన్నింగ్స్‌లో 24.99 యావరేజ్‌తో 656 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి.

ఆడింది 40 ఇన్నింగ్స్‌లే..

ఆడింది 40 ఇన్నింగ్స్‌లే..

గాయాలు, విశ్రాంతితో తరుచూ జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 39 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో 29 ఇన్నింగ్స్‌లు టీ20 ఫార్మాట్‌లోనే ఆడగా.. 8 ఇన్నింగ్స్‌లు వన్డేల్లో, 3 ఇన్నింగ్స్‌లు టెస్ట్ ఫార్మాట్‌లో ఆడాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం పొట్టి ఫార్మాట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన రోహిత్ శర్మ.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో 5 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచకప్ అందిస్తాడని భావించిన అభిమానులకు నిరాశనే మిగిల్చాడు.

ఐపీఎల్‌లోనూ అట్టర్ ఫ్లాఫ్..

ఐపీఎల్‌లోనూ అట్టర్ ఫ్లాఫ్..

ఐపీఎల్ 2022 సీజన్‌లో అటు కెప్టెన్‌గా.. ఇటు ప్లేయర్‌గా రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 268 పరుగులే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 48 కావడం విశేషం. యావరేజ్ 19.14 మరీ దారుణం. రోహిత్ వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోవడం ఇదే తొలిసారి. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ కూడా 20 కంటే తక్కువ యావరేజ్ నమోదు చేయడం కూడా ఇదే తొలిసారి.

టీమిండియా కెప్టెన్‌గానూ...

టీమిండియా కెప్టెన్‌గానూ...

టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ ఈ ఏడాది దారుణంగా విఫలమయ్యాడు. ఓ కెప్టెన్ 50 ప్లస్ స్కోర్ చేసినా టీమిండియా ఓడిపోవడం..16 విజయాల తర్వాత ఇదే తొలిసారి. వన్డేల్లో వరుసగా 24 సార్లు చేజింగ్‌లో నెగ్గిన భారత్.. ఆ రికార్డుకు కూడా ఈ ఏడాదే ముగింపు పలికింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఆసియా కప్ ఓడిపోవడం.. టీ20ల్లో 180 ప్లస్ పరుగులకు కాపాడుకోకపోవడం ఇదే తొలిసారి. మొత్తంగా రోహిత్ శర్మ ఈ ఏడాది పీకిందేం లేదు.

Story first published: Thursday, December 22, 2022, 10:55 [IST]
Other articles published on Dec 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X