న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాపై నేనే జోక్ వేసుకున్నా.. ఎవరినీ కించపరచలేదు'

The joke is on me, Kerry OKeefe clarifies his controversial comments made on Indian players

మెల్‌బౌర్న్‌: టీమిండియాను.. భారత దేశీవాళీ క్రికెట్‌ను(రంజీ ట్రోఫీ) ఉద్దేశించిన కించపరిచే వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత కెర్రీ ఓకీఫ్‌. ఇందుకు సంబంధించి వివాదాలు చెలరేగడంతో తనను క్షమించాలని అభిమానులు, ఆటగాళ్లకు బహిరంగ లేఖ రాశాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ అందులో పేర్కొన్నాడు. నోరు జారిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజు అరంగేట్రం ఆటగాడు మయాంక్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడు రంజీల్లో రైల్వే క్యాంటీన్‌ జట్టుపై ట్రిపుల్ సెంచరీ చేశాడని ఎగతాళి చేశాడు.

ఒకీఫ్ మాటలతో విమర్శలకు గురి చేశాడని

ఒకీఫ్ మాటలతో విమర్శలకు గురి చేశాడని

రంజీ క్రికెట్‌ స్థాయిని తక్కువ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు చెలరేగాయి. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, మాజీ క్రికెటర్లు, మ్యాచ్‌ ముగిసిన తర్వాత జట్టు సభ్యులు ఆయన మాటల్ని విమర్శించారు.

ఇదంతా మా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉన్న గొప్పదనం: కోహ్లీ(వీడియో)

ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించడంతో

ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించడంతో

‘భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా ఫాక్స్‌ క్రికెట్‌ ఛానల్లో చేసిన వ్యాఖ్యల స్పందనకు కుంగిపోయా. నా మాటల్లో ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించారు. నా అసలు ఉద్దేశం వేరు. తీవ్రంగా సాగుతున్న వ్యాఖ్యానాన్ని సరదాగా మార్చాలని అనుకున్నా. ఈ క్రమంలో నోరు జారి రైల్వే క్యాంటీన్‌ పదాల్ని వాడాను. భారత క్రికెట్‌ను అగౌరవ పరచలేదు. ఒక పాఠశాల విద్యార్థిగా పర్యటించిన భారత్‌ ఇప్పుడు అద్భుత క్రికెట్‌ జాతిగా ఎదిగింది. సిరీస్‌కు ముందు ఆటగాళ్లపై ఎంతో పరిశోధన చేస్తా. రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్‌ పుజారాను అవమానించలేదు. నాపై నేనే జోక్‌ వేసుకున్నా' అని ఓకీఫ్ లేఖలో రాశాడు.

క్యాంటిన్‌ కుర్రాళ్ల జట్టుపై సెంచరీ

క్యాంటిన్‌ కుర్రాళ్ల జట్టుపై సెంచరీ

ఆస్ట్రేలియా వ్యాఖ్యాత కెర్రీ ఓ కీఫ్‌.. మయాంక్‌ అగర్వాల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాక్స్‌ స్పోర్ట్‌ ఛానెల్‌ తరఫున మాట్లాడుతూ.. ‘‘బహుశా రంజీల్లో మయాంక్‌ చేసిన ట్రిపుల్‌ సెంచరీ.. రైల్వే క్యాంటిన్‌ కుర్రాళ్ల జట్టుపై చేసుంటాడు'' అని వ్యాఖ్యానించాడు. మార్క్‌వా కూడా కెర్రీకి మద్దతిచ్చినట్లు మాట్లాడాడు. ఆస్ట్రేలియా దేశవాళీతో పోలిస్తే.. భారత్‌ దేశవాళీ క్రికెట్‌ ప్రమాణాలు అంత గొప్పవి కావన్నట్లు వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ దేశవాళీలో 50 సగటు.. ఆస్ట్రేలియాలో 40కు సమానమన్నాడు. వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపాయి. చివరకు ఓ కీఫ్‌ క్షమాపణ చెప్పాడు.

చతేశ్వర్‌, జడేజా వంటి పేర్లు

చతేశ్వర్‌, జడేజా వంటి పేర్లు

'అసలు మీ పిల్లలకు చతేశ్వర్‌, జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు' అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. కీఫ్‌ వ్యాఖ్యల గురించి భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ స్పందిస్తూ...‘ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే కొంత బాధిస్తాయి. కానీ వాటిని మనం నియంత్రించలేం. అయితే ఆ బాధను కసిగా మార్చుకొని మైదానంలో చెలరేగితే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చినట్లే' అని అభిప్రాయపడ్డారు. లెగ్‌స్పిన్‌ బౌలర్‌ అయిన 69 ఏళ్ల కెరీ ఒ కీఫ్‌ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు.

Story first published: Monday, December 31, 2018, 9:11 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X