For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదంతా మా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉన్న గొప్పదనం: కోహ్లీ(వీడియో)

India vs Australia: Kohli Takes Dig at Australian Commentators Who Ridiculed Indian Domestic Cricket
Kohli Takes a Subtle Dig at Australian Commentators Who Ridiculed Indian Domestic Cricket

మెల్‌బౌర్న్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం ఆసీస్ ఆటగాళ్లకు సరైన బదులిచ్చింది. మూడో టెస్టు మొదలైనప్పటి నుంచి పర్యటనలో ఏ మ్యాచ్‌లో జరగనన్ని వివాదాలు, స్లెడ్జింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత ప్లేయర్లను కించపరుచుతూ కామెంటేటర్లు కూడా పలు సార్లు వ్యాఖ్యలు చేశారు. వారందరికీ విజయం తర్వాత కెప్టెన్ కోహ్లీ ధీటైన సమాధానమే ఇచ్చాడు. భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ కెరీ ఓ కీఫ్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడని సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అద్భుతం.. విజయం సాధించాం

అరంగేట్ర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు కెరీ ఓ కీఫ్‌. మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ‘జలంధర్‌ రైల్వే క్యాంటీన్‌ నౌకర్ల' బౌలింగ్‌లో మయాంక్‌ రంజీ ట్రిపుల్‌ సెంచరీ చేసి ఉంటాడని ఓ కీఫ్‌ కామెంట్‌ చేశాడు. అయితే ఈ టెస్ట్‌ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అద్భుతం. దానివల్లే మేం ఈ విజయం సాధించాం. ఈ గెలుపు క్రెడిట్‌ కచ్చితంగా భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడిన తీరుకు సంబంధించినదే. అక్కడ మా బౌలర్లకు ఎదురైన సవాళ్లు విదేశాల్లో రాణించేలా చేశాయి' అని ఫస్ట్‌ క్రికెట్‌ విధానాన్ని కోహ్లి కొనియాడాడు.

మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా

మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా

ఓ కీఫ్‌ మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలను ఉద్దేశించే కోహ్లి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను కొనియాడాడు. రంజీ క్రికెట్‌లో చాలా బంతులు వేయడం వల్లే ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు.

పిల్లలకు చతేశ్వర్‌ జడేజా లాంటి పేర్లు

ఇక ఓ కీఫ్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. నాలుగో రోజు ఆటలో భారత్‌ ఆటగాళ్లపై మళ్లీ మాట తూలాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్‌, జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు' అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. దీంతో ఒ కీఫ్‌ తీరుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Sunday, December 30, 2018, 16:22 [IST]
Other articles published on Dec 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+