న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కూకాబుర్ర కాదు డ్యూక్‌ బంతులతో!: భారత బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించిన గంభీర్

The Dukes ball will make it difficult for India in Windies: Gautam Gambhir

హైదరాబాద్: విండిస్ పిచ్‌లపై డ్యూక్ బంతులను ఎదుర్కొనడం కోహ్లీసేనకు అతిపెద్ద సవాల్ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-విండిస్ జట్ల మధ్య తొలి టెస్టు ఆంటిగ్వా వేదికగా గురువారం ఆరంభం కానుంది.

రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా ప్రయోగం చేయండి: గంగూలీ

ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "వెస్టిండిస్‌లో టెస్టు క్రికెట్‌ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఆతిథ్య జట్టు డ్యూక్‌ బంతులకే కట్టుబడి ఉండటం మంచి నిర్ణయం. గతంలో విండీస్‌ కూకాబుర్ర బంతులతో మ్యాచ్‌లు ఆడేది. డ్యూక్‌ బంతులను బ్రిటన్‌ కంపెనీ తయారు చేస్తోంది" అని గంభీర్ తెలిపాడు.

"నిజానికి కూకాబుర్ర బంతులతో పోలిస్తే ఇవి గట్టి సవాళ్లు విసురుతాయి. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లాండ్ జట్టుని ఓడించిన సిరిస్‌లో పిచ్‌లు భిన్నంగా ఉన్నాయి. భారత జట్టుతో జరగబోయే సిరీస్‌లోనూ అలాంటి పిచ్‌లే ఉండాలని కోరుకుంటున్నా. ఈ పిచ్‌లపై కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ను ఓపెనర్లుగా బరిలోకి పంపాలి. టాపార్డర్‌లో పంపించి విహారి కెరీర్‌ను ప్రమాదంలో పడేయొద్దు" అని గంభీర్ అన్నాడు.

పీకేఎల్ 2019లో 100 రైడ్ పాయింట్లు చేసిన తొలి ఆటగాడు ఎవరో తెలుసా?

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా తన సిరిస్‌ను విండిస్ పర్యటనతో ప్రారంభిస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతోంది. తొలి టెస్టులో వన్డే వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం కల్పించాలా? లేక రహానేను ఆడించాలో? లేదా ఐదో బౌలర్‌ వైపు మొగ్గు చూపాలో? అని సతమతమవుతోంది.

ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలనుకుంటే.. రహానే, రోహిత్లో ఒక్కరికే అవకాశం దక్కుతుంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇద్దరు ఉంటే.. స్పిన్నర్ రవీంద్ర జడేజాపై వేటు పడుతుంది. ఏదేమైనా తుది జట్టులో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న రహానేకు అవకాశం లభించకపోవచ్చని సమాచారం.

Story first published: Thursday, August 22, 2019, 18:01 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X