Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

Photos: Virat Kohli, Rohit Sharma and Co. flaunt new Test kits with names and numbers

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ప్రారంభనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు, నంబర్లకు ఐసీసీ అనుమతిచ్చింది. యాషెస్‌ తొలి టెస్టు నుంచే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు కొత్త జెర్సీలను ధరించి ఆడాయి.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లు కొత్త జెర్సీలతో టెస్టు క్రికెట్‌ ఆడాయి. ఇప్పుడు టీమిండియా, వెస్టిండిస్ జట్ల వంతు వచ్చింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా టీమిండియా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టులో తలపడనుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా ఆడే తొలి టెస్టులో భారత క్రికెటర్లు నెంబర్లతో కూడిన జెర్సీలతో కనిపించనున్నారు. తొలి టెస్టుకు ముందే ఆటగాళ్లు ధరించనున్న కొత్త జెర్సీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, పంత్, షమీ, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది.. వంద వికెట్లు తీయడమే నా లక్ష్యం

వన్డే జెర్సీలపై ఏయే నెంబర్లను ఆటగాళ్లను కలిగి ఉన్నారో అవే నెంబర్లను టెస్టు జెర్సీలపై కూడా ముద్రించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ వెనుక నెంబర్ 18గా ఉండగా... రోహిత్ శర్మ జెర్సీ వెనుక నెంబర్ 45గా ఉంది. భారత క్రికెటర్ల కొత్త జెర్సీలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు బీచ్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. "బాయ్స్‌తో బీచ్ వద్ద అద్భుతమైన రోజు" అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ కూడా పెట్టాడు.

వన్డే సిరిస్ ముగిసిన తర్వాత టెస్టు సిరిస్‌కు ఆరంభానికి ముందు కాస్త విరామ సమయం దొరకడంతో టీమిండియా కరేబియన్ దీవులను చుట్టేస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో పాటు సహాయక బృందాన్ని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఐసీసీ ప్రతిషాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్‌ పర్యటనతో ప్రారంభించనుంది.

Story first published: Wednesday, August 21, 2019, 15:42 [IST]
Other articles published on Aug 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+