న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: పీటర్సన్‌.. నువ్ ఒక్కడివే అర్థం చేసుకున్నావ్: రోహిత్

Thankfully someone here understands the game: Rohit Sharma on Kevin Pietersens video

అహ్మదాబాద్: గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే టీమిండియా టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యం సాధించింద‌న్న ఆనంద‌మే ఉన్నా.. మ్యాచ్ మ‌రీ రెండు రోజుల్లోపే ముగియ‌డం ప‌ట్ల కొంత మంది మాజీలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలిస్టర్ కుక్ లాంటి ఇంగ్లండ్ మాజీలు మొతేరా పిచ్‌పై మండిపడుతున్నారు.

బిన్నంగా స్పందించిన పీటర్సన్‌

అయితే ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని అందికంటే బిన్నంగా తన అభిప్రాయం వెల్లడించాడు. మ్యాచ్‌ ఇలా త్వరగా పూర్తవ్వడం నిరాశ కలిగించినా.. అందుకు ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే అని పేర్కొన్నాడు. స్పిన్‌కు అనుకూలించే మొతేరా పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు తేలిపోయారన్నాడు. కేపీ వ్యాఖ్యలపై భారత స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. మమ్మల్ని మీరు ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారని కేపీ వీడియోకు కామెంట్‌ చేశాడు.

ఒక్కడివే అర్థం చేసుకున్నావ్

ఒక్కడివే అర్థం చేసుకున్నావ్

'భారత్-ఇంగ్లండ్ జట్లలో బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. పేలవంగా ఆడామనే ఒప్పుకుంటారు. మొత్తంగా 30లో 21 వికెట్లు.. నేరుగా వికెట్‌ టు వికెట్‌ విసిరిన బంతులకే వచ్చాయి. పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. బ్యాట్స్‌మెన్‌ కాస్త జాగ్రత్తగా ఆడాల్సింది. అలా ఆడి ఉంటే ఈ టెస్టు మూడు లేదా నాలుగు రోజులకు వెళ్లేది' అని కెవిన్‌ పీటర్సన్‌ వీడియోలో చెప్పాడు. 'ధన్యవాదాలు పీటర్సన్‌.. నువ్ ఒక్కడివి మాత్రమే ఆటను అర్థం చేసుకున్నావ్' అని రోహిత్ కామెంట్ పెట్టాడు.

వాన్‌ విమర్శలు

వాన్‌ విమర్శలు

మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ మొదటి నుంచీ విమర్శలు చేస్తున్నాడు. 'ఏదైనా చేయడానికి టీమిండియాకు ఐసీసీ అనుమతిస్తుంది. దాంతో అంతిమంగా టెస్టు క్రికెట్‌కు నష్టం జరుగుతోంది. తొలి టెస్టు తర్వాత 1-0 తేడాతో వెనుకబడ్డాక.. మిగతా టెస్టులకు తొలి బంతి నుంచే పిచ్‌ స్పందించేలా రూపొందించారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే భారత్ మూడో టెస్టులో విజయం సాధించింది. అది నిస్సారమైన గెలుపని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏ జట్టూ విజయం సాధించలేదు' అని పేర్కొన్నాడు.

112, 81 పరుగులకే ఆలౌట్

112, 81 పరుగులకే ఆలౌట్

డేనైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా.. భారత్‌ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.

India vs South Africa: దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. భారత వన్డే, టీ20 జట్లు ఇవే!!

Story first published: Saturday, February 27, 2021, 18:16 [IST]
Other articles published on Feb 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X