న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ను అచ్రేకర్ నిందించిన వేళ..

Teachers Day: When Ramakant Achrekar scolded Sachin Tendulkar and changed his life

ముంబై: భారత క్రికెట్ జట్టుకు గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరొందిన సచిన్‌ టెండూల్కర్ గురువు.. రమాకాంత్‌ అచ్రేకర్‌ (87) వృద్ధాప్య సమస్యలతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. సచిన్‌తో పాటుగా వినోద్ కాంబ్లీ కూడా ఆయన దగ్గర శిక్షణ పొందినవారే. ఇలా క్రికెట్లో ఎంతో మందికి ఓనమాలు నేర్పించిన ఆయనకు, దేశానికి పేరు తీసుకొచ్చింది మాత్రం సచిన్‌ టెండూల్కరే. బాల్యంలో ఆయన ఎంత కఠినంగా తనకు శిక్షణనిచ్చారో మాస్టర్‌ బ్లాస్టర్ ఎన్నో సార్లు గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నడూ ఒక్క మ్యాచ్‌లోనూ బాగా ఆడానని తన గురువుగారు మెచ్చుకోలేదని గతంలో సచిన్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

పాఠశాల ముగిశాక సచిన్‌ను ప్రాక్టీస్‌

పాఠశాల ముగిశాక సచిన్‌ను ప్రాక్టీస్‌

అంతేకాకుండా తన ఆదేశాలను అనుసరించనందుకు ఒకసారి సచిన్‌ను అచ్రేకర్‌ మందలించారట. పాఠశాల ముగిసిన తర్వాత ఆయన సచిన్‌ను ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడమని నిర్దేశించారట. కానీ, అదే రోజు టెండూల్కర్ చదువుకుంటున్న శారదాశ్రమ్‌ విద్యామందిర్‌ పాఠశాల సీనియర్‌ జట్టు వాంఖడేలో హారిస్‌ షీల్డ్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్లను ప్రోత్సహించాలని సచిన్‌ మైదానానికి వెళ్లాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అచ్రేకర్‌ సర్‌ను పలకరించారట.

మయాంక్ హాఫ్ సెంచరీ, నిలకడగా ఆడుతున్న టీమిండియా

ఇతరులకు చప్పట్లు కొట్టాల్సిన అవసర్లేదు

ఇతరులకు చప్పట్లు కొట్టాల్సిన అవసర్లేదు

వెంటనే సచిన్‌ను.. అచ్రేకర్ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశావంటూ అడిగారట. సీనియర్లను ప్రోత్సహించేందుకు ఇక్కడికొచ్చానని సచిన్‌ బదులిచ్చారట. సచిన్ సమాధానానికి ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్రేకర్‌‌ ‘నువ్వు ఇతరులకు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఆటపై శ్రద్ధ పెట్టు. ఏదైనా సాధించు. అప్పుడు ఇతరులు నీకోసం చప్పట్లు కొడతారు' అని గట్టిగా మందలించారట.

కొన్ని సార్లు పానీపూరీ తినిపించేందుకు

కొన్ని సార్లు పానీపూరీ తినిపించేందుకు

'నేను బాగా ఆడానని గురువు గారు ఎప్పుడూ చెప్పలేదు. కానీ, కొన్ని సార్లు ఆయన నాకు పానీపూరీ తినిపించేందుకు తీసుకెళ్లేవారు. మైదానంలో అద్భుతంగా ఆడినందుకు గురువుగారు సంతోషపడ్డారని దాని అర్థం' అని పేర్కొన్నారు.

రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి

రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి

ఆ తర్వాత 1988 ఫిబ్రవరిలో జరిగిన అదే టోర్నీ హారిస్ షీల్డ్ సెమీ ఫైనల్‌లో సచిన్ టెండూల్కర్ 326 నాటౌట్, వినోద్ కాంబ్లీ 349 నాటౌట్ .. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో శారదాశ్రమ్ విద్యామందిర్ జట్టుతో సెయింట్ జేవియర్ హైస్కూల్ జట్టు ఆజాద్ మైదాన్ వేదికగా తలపడింది.

Story first published: Thursday, January 3, 2019, 10:12 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X