న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఆ జాబితాలో భారత్ నుంచి కింగ్ కోహ్లీ ఒక్కడే!

T20 Worldcup 2022: Virat Kohli Is The Only Player To Rank In Top 10 In Australia

హైదరాబాద్: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఈ మెగా టోర్నీ క్వాలిఫయర్ మ్యాచ్‌లకు తెరలేవనుండగా.. అక్టోబర్ 22 నుంచి అసలు సిసలు సమరం మొదలవ్వనుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌ టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్-12 ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు వరల్డ్ బిగ్గేస్ట్ భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

ఇప్పటికే ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఆయా జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. కొన్ని జట్లు అయితే ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నాయి. ఓవైపు ఆటగాళ్లంతా ఈ మెగా టోర్నీకి సన్నదమవుతుంటే.. మరోవైపు మాజీ క్రికెటర్లు తమ విశ్లేషణలు, అంచనాలతో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కండిషన్స్ గురించి బాగా చర్చ జరుగుతోంది. పెద్ద మైదానాలు, పేస్, బౌన్సి పిచ్‌లపై ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీ20ల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్ల జాబితా ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జాబితాలో ఏడుగురు ఆస్ట్రేలియన్స్ ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే నాన్ ఆస్ట్రేలియన్‌గా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఆసీస్ గడ్డపై 39 మ్యాచ్‌ల్లో 1025 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాప్‌లో ఉండగా.. డేవిడ్ వార్నర్(27 మ్యాచ్‌ల్లో 933), గ్లేన్ మ్యాక్స్‌వెల్(27 మ్యాచ్‌ల్లో 656), విరాట్ కోహ్లీ(10 మ్యాచ్‌ల్లో 451), మాథ్యూ వేడ్(14 మ్యాచ్‌ల్లో 420)లు టాప్ 5లో ఉన్నారు. షేన్ వాట్సన్(15 మ్యాచ్‌ల్లో 376), వైట్(15 మ్యాచ్‌ల్లో 376), స్టీవ్ స్మిత్(15 మ్యాచ్‌ల్లో 367) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలోని ఏడుగురు ఆస్ట్రేలియన్లు కాగా.. కోహ్లీ ఒక్కడే నాన్ ఆస్ట్రేలియన్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆసీస్ గడ్డపై కింగ్ కోహ్లీకి సూపర్ రికార్డు ఉందని, ఈసారి కూడా అతను ఇదే జోరు కొనసాగిస్తాడని అతని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా కప్ ముందు వరకు నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన విరాట్ కోహ్లీ.. ఆ టోర్నీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని అందుకున్న కింగ్ కోహ్లీ అదే జోరును కొనసాగిస్తూ వస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. వాస్తవానికి ఆసియాకప్ ముందు కోహ్లీ నెల రోజుల పాటు విరామం తీసుకున్నాడు. ఈ సుదీర్ఘ బ్రేక్ అతనికి కలిసొచ్చింది. ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్న కోహ్లీ స్వేచ్చగా బౌలర్లను చెడుగుడు ఆడుతున్నాడు.

Story first published: Thursday, October 13, 2022, 14:01 [IST]
Other articles published on Oct 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X