న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: యుజ్వేంద్ర చాహల్ కొంటే వేషాలు.. అంపైర్ పురుషాంగంపై పంచ్! (వీడియో)

T20 World Cup 2022: Yuzvendra Chahal has fun with umpires during IND vs SA game goes viral

పెర్త్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టులో తన కొంటే వేషాలతో సహచర ఆటగాళ్లందరిని నవ్విస్తుంటాడు. ట్విటర్ వేదికగా తనదైన పంచ్‌లతో అభిమానులను అలరిస్తుంటాడు. టీ20 ప్రపంచకప్ 2022 కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న యుజ్వేంద్ర చాహల్.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టీమ్ కాంబినేషన్‌తో పాటు పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటుండటంతో రోహిత్.. చాహల్‌కు అవకాశం ఇవ్వడం లేదు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ చాహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తుది జట్టులో చోటు దక్కకపోవడంతో టీమ్ వాటర్ బాయ్‌గా సేవలందిస్తున్నాడు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ వాటర్ బాటిల్స్ మోస్తూ కనబడ్డాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్‌ను ఆటబట్టించాడు. డ్రింగ్స్ బ్రేక్ టైమ్‌లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. సూర్యకుమార్ యాదవ్‌‌కు పలు సూచనలు చేస్తుండగా.. పక్కనే ఉన్న చాహల్ అంపైర్ పురుషాంగంపై పంచ్ ఇచ్చాడు. ఇది కాస్త టీవీలో కనిపించడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తుది జట్టులో అవకాశం దక్కకపోవడంతో చాహల్ అంపైర్ 'బాల్స్'తో ఆడుకుంటున్నాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.

Story first published: Monday, October 31, 2022, 10:05 [IST]
Other articles published on Oct 31, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X