న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఒకటా.. రెండా.. మూడు టైటిళ్లు మింగిన కేఎల్ రాహుల్! టీమిండియాకు శనిలా..!

T20 World Cup 2022: KL Rahul fails last three World Cups

హైదరాబాద్: 'ప్రతిభావంతమైన ఆటగాడే.. కానీ ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడు' టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చేసిన వ్యాఖ్య ఇది. టీ20 ప్రపంచకప్ 2022లో వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌కు అండగా నిలుస్తూ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు రాథోడ్ చేసిన వ్యాఖ్యలివి. అయితే రాథోడ్ వ్యాఖ్యలను కేఎల్ రాహుల్ నిజం చేశాడు. అంతగా ఒత్తిడి లేని బంగ్లాదేశ్, జింబాబ్వే దేశాలపై హాఫ్ సెంచరీలు బాదిన అతను తీవ్ర ఒత్తిడితో కూడుకున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లోనే ఔటై.. టీమ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసాడు. రాహుల్ కారణంగా ఒత్తిడికి లోనైన భారత్ నెమ్మదైన బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2021 ప్రపంచకప్‌లోనూ..

2021 ప్రపంచకప్‌లోనూ..

ఇదే టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఇలానే తీవ్ర ఒత్తిడికి గురై రాహుల్ వికెట్ పారేసుకున్నాడు. చివరకు కోహ్లీ పుణ్యమా అంటూ ఆ మ్యాచ్‌లో గట్టెక్కినా.. ఆ తర్వాత రాహుల్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఈ టోర్నీలోనే కాదు గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రాహుల్ ఇలానే ఆరంభంలో ఔటై జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ మ్యాచ్‌లో షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

న్యూజిలాండ్‌తోనూ..

న్యూజిలాండ్‌తోనూ..

ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. విరాట్ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఔటైన తర్వాత రాహుల్ గనుక క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం మరోలా ఉండేది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఆరంభంలోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఓటమిపాలైంది. దాంతో నాకౌట్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.

2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ..

2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ..

మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ కేఎల్ రాహుల్(1) ఒత్తిడికి చిత్తయ్యాడు. న్యూజిలాండ్ విధించిన 240 పరుగుల లక్ష్యచేధనలో టీమిండియా వరుస రెండు ఓవర్లలో రోహిత్, విరాట్ కోహ్లీ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన రాహుల్ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దాంతో జట్టు మొత్తం తీవ్ర ఒత్తిడిలోపడిపోయింది. ధోనీ, జడేజా హాఫ్ సెంచరీలతో విజయం కోసం చివరి వరకు పోరాడే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో ఔటవ్వడం భారత జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. పవర్ ప్లే ముగిసేవరకైనా రాహుల్ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా భారత్‌కు కలిసొచ్చేది.

రోహిత్‌పై అనవసర ఒత్తిడి..

రోహిత్‌పై అనవసర ఒత్తిడి..

రాహుల్ వైఫల్యం కారణంగా రోహిత్ శర్మపై అనవసర ఒత్తిడి పడుతోంది. రాహుల్ తడబాటు నేపథ్యంలో రోహిత్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ జట్టులో నుంచి తప్పించాలని, అతనికి ఐపీఎల్ సెట్ అవుతుందని అభిమానులు సూచిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఉన్నన్ని రోజులు టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదని, రాహుల్‌కు బదులు ధాటిగా పృథ్వీ షాను సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Story first published: Sunday, November 13, 2022, 16:13 [IST]
Other articles published on Nov 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X