న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: పిచ్చి ప్రయోగాలతో టీమిండియాను రాహుల్ ద్రవిడ్ నాశనం చేసిండు!

 T20 World Cup 2022: Fans slam head coach Rahul Dravid After India suffer humiliating exit

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. సెమీస్‌లో సత్తా చాటి మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో మరోసారి పాకిస్థాన్‌ను ఢీకోడుతుందని, క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఫైనల్ సాధ్యమవుతుందని భావించిన వారందరికీ ఇంగ్లండ్ బలమైన షాకిచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దాంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశం మరోసారి చేజారింది. ఈ పరాజయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంతో ఉందో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ది అంతకుమించి ఉంది. ఐసీసీ టైటిళ్లు గెలవలేదని కోహ్లీ-రవిశాస్త్రి ద్వయాన్ని పక్కనపెట్టేసిన బీసీసీఐ.. ఆ బాధ్యతలను దివాల్ రాహుల్ ద్రవిడ్ చేతిలో పెట్టింది.

అనవసర ప్రయోగాలతో..

ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వనంత డబ్బును ఆఫర్ చేసింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఏడాదికి రూ.10 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ద్రవిడ్ అంతటి కాస్ట్‌లీ కోచ్ మరొకరు లేరు. అతను మాత్రం జట్టును విశ్వవిజేతగా నిలబెట్టకపోగా అనవసర ప్రయోగాలతో నాశనం చేశాడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మను సారథిని చేశాడు. మిషన్ మెల్‌బోర్న్ పేరిట గత ఏడాదిగా చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. తీరిక లేని క్రికెట్‌తో ఆటగాళ్లు అలసిపోయారని, జట్టు ఎంపికలో పొరపాట్లు జరిగాయని విమర్శలు రావడంతో కీలక ఆటగాళ్లకు తరచుగా విశ్రాంతినిస్తూ, చాలామంది కుర్రాళ్లకు అవకాశాలిస్తూ ద్రవిడ్ ప్రయోగాల మీద ప్రయోగాలు చేశాడు.

కుదురుకునే అవకాశం ఇవ్వలేదు..

ఇక కుర్రాళ్లకు బోలెడన్ని అవకాశాలిచ్చినా.. అందులో ఒక ప్రణాళిక అంటూ కనిపించలేదు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మార్పులు చేర్పులు చేస్తూ ఎవ్వరికీ కుదురుకునే అవకాశం ద్రవిడ్ ఇవ్వలేదు. అర్ష్‌దీప్‌ ఒక్కడు జట్టులో స్థిరపడ్డాడు. పెద్దగా నిరూపించుకున్నదేమీ లేకపోయినా దీపక్‌ హుడాకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యకరం. ఒక ప్రణాళిక అంటూ లేకుండా ఇష్టానుసారం ప్రయోగాలు చేసి చివరికి పెద్దగా టీ20 క్రికెట్‌ ఆడని షమీ, అశ్విన్‌లను ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేయడంలో ఔచిత్యమేంటో అర్థం కాని విషయం.

ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టి..

నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులేసే ఉమ్రాన్‌ మాలిక్‌ ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగానే పక్కన పెట్టేశాడు. మిగతా ఆటగాళ్లకు ఇచ్చినట్లు అవకాశాలు ఇచ్చి ఉంటే అతను ఈ ప్రపంచకప్‌లో జట్టుకు బాగా ఉపయోగపడేవాడేమో. రవి బిష్ణోయ్‌ పరిస్థితీ అంతే. ప్రపంచ క్రికెట్లో ఆఫ్‌ స్పిన్నర్ల ఆధిపత్యానికి తెరపడి చాలా కాలం అయింది. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అయినా, లీగ్‌ క్రికెట్లో అయినా మణికట్టు స్పిన్నర్లదే హవా. భారత క్రికెట్లోనూ అందుకు భిన్నమేమీ కాదు. చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ లాంటి మణికట్టు స్పిన్నర్లే సత్తా చాటుతూ వస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రపంచకప్‌కు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లను ఎంపిక చేయడం విడ్డూరం.

చాహల్‌కు ఒక్క అవకాశం ఇవ్వలేదు..

సెమీస్‌ మ్యాచ్‌నే తీసుకుంటే మొదట ఆదిల్‌ రషీద్‌కు తోడు పార్ట్‌ టైమర్‌ అయిన లివింగ్‌స్టోన్‌.. కోహ్లీ, సూర్య, హార్దిక్‌లను ఎంత ఇబ్బంది పెట్టారో చూశాం. వాళ్లంత బాగా బౌలింగ్‌ చేసిన పిచ్‌పై అశ్విన్‌, అక్షర్‌ తేలిపోయారు. చాహల్‌ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని.. లెగ్‌స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతున్న ప్రపంచకప్‌లో అతణ్ని ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో ఆడించలేదు. బిష్ణోయ్‌ని అసలు ప్రపంచకప్‌ కోసం ఎంపికే చేయలేదు. అశ్విన్‌, అక్షర్‌లకు తోడు భువనేశ్వర్‌దీ ఇలాంటి పరిస్థితే. గత ప్రపంచకప్‌లోనే కాక ప్రస్తుత టోర్నీకి ముందు కొన్ని కీలక మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ దారుణమైన ప్రదర్శన చేశాడు. అయినా అతణ్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. టీమ్ ఎంపిక దగ్గర్నుంచి మ్యాచ్ తగ్గ ప్రణాళికలు రచించడంలోనూ ద్రవిడ్ విఫలమయ్యాడు. ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ కూడా పేలవంగా మారింది.

Story first published: Friday, November 11, 2022, 15:22 [IST]
Other articles published on Nov 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X