న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్!(వీడియో)

T20 World Cup 2021: Curtis Campher Of Ireland Takes 4 Wickets In 4 Balls vs Netherlands

అబుదాబి: ఐర్లాండ్ పేసర్ కర్టిస్ కాంపేర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ 1‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కాంపేర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా కాంపేర్ గుర్తింపు పొందాడు. ఈ ఐర్లాండ్ బౌలర్ కన్నా ముందు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ ఫీట్ సాధించారు.

నెదర్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 10వ ఓవర్ బంతిని అందుకున్న కర్టిస్ కాంపేర్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా నెదర్లాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ అకెర్‌మాన్‌(11), రియాన్ టెన్ డూషె(0), స్కాట్ ఎడ్వర్డ్స్‌(0), రోలోఫ్ వాండెర్ మెర్వ్‌(0)లను పెవిలియన్ చేర్చాడు. ఇందులో ఇద్దరిని ఎల్బీగా ఔట్ చేసిన కాంపేర్.. ఒకరిని క్యాచ్ ఔట్‌గా మరొకరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. క్యాచ్ ఔట్ విషయంలో అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఐర్లాండ్ రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. తద్వారా టీ20ల్లో ఐర్లాండ్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా కూడా కర్టిస్ కాంఫర్ నిలిచాడు. 4 ఓవర్లలో 4 వికెట్లకు 26 పరుగులు ఇచ్చాడు.

4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. ఈ ఘనత మలింగ తొలిసారి అందుకున్నాడు. 2007లో సౌతాఫ్రికాపై మలింగ ఈ డబుల్ హ్యాట్రిక్ తీశాడు. 2019లో మరోసారి న్యూజిలాండ్‌పై ఇదే రికార్డు రిపీట్ చేశాడు. ఇక అదే ఏడాది రషీద్ ఖాన్ కూడా ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కర్టిస్ కాంపేర్ ధాటికి కుదేలైన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మ్యాక్స్ ఓ దౌద్(47 బంతుల్లో 7 ఫోర్లతో 51) మినహా అంతా విఫలయ్యారు. ఐదుగురు బ్యాట్స్‌మన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కర్టిస్ కాంపేర్(4/26) నాలుగు వికెట్లకు తోడుగా మార్క్ అడైర్(3/9) మూడు వికెట్లతో రాణించాడు. జోష్ లిటిల్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్.. 15.1 ఓవర్లలో 3 వికెట్లకు కోల్పోయి 107 రన్స్ చేసింది. దాంతో 7 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(39 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 30 నాటౌట్), గారెత్ డెలనీ(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) రాణించారు.

Story first published: Monday, October 18, 2021, 18:56 [IST]
Other articles published on Oct 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X