న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి‌! సెమీస్‌కు బరోడా!

Syed Mushtaq Ali Trophy 2021: Vishnu Solanki hits six off final ball like MS Dhoni

అహ్మదాబాద్‌: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు సెమీస్‌ కోసం ప్రయత్నిస్తుండడంతో టీ20 మ్యాచులు ఉత్కంఠంగా జరుగుతున్నాయి. బుధవారం బరోడా, హర్యానా జట్ల మధ్య మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ ‌అభిమానులకు థ్రిల్‌ కలిగించడమే గాక వారిని మునివేళ్లపై నిలబెట్టింది. బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి చివరి బంతికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలో హెలికాప్టర్‌ షాట్ ఆడి తన జట్టును సెమీస్‌ చేర్చాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన సోలంకి

ఆకాశమే హద్దుగా చెలరేగిన సోలంకి

మొతెరా స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హెచ్ రానా (49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా.. చివమ్ చౌహన్ 35 రన్స్ చేశాడు. సుమిత్ కుమార్ (20) ధాటిగా ఆడడంతో హర్యానా పోరాడే స్కోర్ చేసింది. బరోడా బౌలర్ కార్తీక్ కాకడే రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్‌ స్మిత్‌ పటేల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు.

3 బంతుల్లో 15 పరుగులు:

విష్ణు సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా జట్టు ఈజీగానే మ్యాచ్‌ను గెలుస్తుంది అనిపించింది. అయితే 19వ ఓవర్‌ వేసిన హర్యానా బౌలర్‌ మోహిత్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మోహిత్‌ వేసిన ఆ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌కు బరోడా జట్టు 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ సుమిత్‌ కుమార్‌ వేయగా.. మొదటి బంతికి సింగిల్‌ వచ్చింది. రెండో బంతికి సోలంకి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుమీత్‌ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ రావడంతో.. బరోడా జట్టుకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది.

ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్

ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్

సుమిత్‌ కుమార్ వేసిన నాలగో బంతిని సిక్స్‌ కొట్టిన విష్ణు సోలంకి.. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలం సూపర్ సిక్సర్ బాదాడు. ఎంఎస్ ధోనీ ఫేవరెట్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ సిక్స్‌తో జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోలంకి ఆడిన హెలికాప్టర్‌ షాట్‌ను చూస్తే మహీ మెచ్చుకోకుండా ఉండలేడని కామెంట్లు పెడుతున్నారు.

ఏఆర్‌ రెహమాన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్‌! ఆహ్లదకరమైన సాయంత్రం అంటూ!

Story first published: Wednesday, January 27, 2021, 20:54 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X