న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Syed Mushtaq Ali Trophhy: 17 సిక్సర్లతో పునీత్ బిష్త్ వీరవిహారం.. అయ్యర్ రికార్డు బ్రేక్!

Syed Mushtaq Ali Trophy 2021: Meghalaya skipper Punit Bisht creates new Indian record for maximum sixes
Puneet Bisht Created A New World Record After Smashing 17 Sixes In T20 Match|Syed Mushtaq Ali Trophy

చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మిజోరాంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పునీత్ బిష్త్ 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దాంతో టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా గుర్తుంపి పొందాడు. గతంలో శ్రేయస్ అయ్యర్ 15 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. యునివర్స్ బాస్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో 18 సిక్స్‌లు బాదాడు.

సెకండ్ హయ్యెస్ట్ స్కోర్..

సెకండ్ హయ్యెస్ట్ స్కోర్..

ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌‌గా పునీత్ బిష్త్ (146 నాటౌట్) ఇన్నింగ్స్ నిలిచింది. 147 రన్స్‌తో శ్రేయస్ అయ్యర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం మిజోరం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసి 130 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది.

అజారుద్దీన్ సెంచరీ..

అజారుద్దీన్ సెంచరీ..

ముంబై: ముంబై జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో కేరళ అద్భుత విజయాన్నందుకుంది. కేరళ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజారుద్దీన్(54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 137 నాటౌట్) మెరుపు ప్రదర్శనతో కేరళ 8 వికెట్లతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేయగా.. కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.

ఆంధ్రాకు రెండో ఓటమి..

ఆంధ్రాకు రెండో ఓటమి..

ముంబై: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఆంధ్ర జట్టు ఫ్లాఫ్ షో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. ఎలైట్ గ్రూప్-ఈలో భాగంగా బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆంధ్ర చిత్తయింది. తొలతు ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్‌ అంబటి రాయుడు (1) పూర్తిగా నిరాశపరచగా.. మిడిలార్డర్‌లో అశ్విన్‌ హెబ్బర్‌ (32), ఆఖర్లో పేసర్‌ కోడి శశికాంత్‌ (21) చెలరేగారు. ప్రదీప్‌ 3, ఇషాంత్‌, సిమ్రన్‌జిత్‌, లలిత్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఢిల్లీ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 128 రన్స్‌ చేసి గెలిచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(5) విఫలమైనా, నితీశ్ రాణా(27), అనూజ్ రావత్(33), హిమ్మత్ సింగ్(32 నాటౌట్) జట్టును గెలిపించారు.

ఆఖరి టెస్ట్ కోసం హోటల్ టాయిలెట్స్ కడుగుతున్న భారత క్రికెటర్లు!

Story first published: Thursday, January 14, 2021, 8:57 [IST]
Other articles published on Jan 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X