న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుశాంత్‌కు ఓ మాటిచ్చా.. కానీ ఇప్పుడు అతడు లేడు: క్రికెటర్

Sushant Singh Rajputs Kai Po Che co-star Digvijay: Promised him well meet after I become a cricketer

ముంబై: గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు గతంలో ఓ మాటిచ్చానని ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు చెందిన యువ క్రికెటర్ దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపాడు. ఇప్పుడు సుశాంత్‌ను కలవాలని ఉన్నా.. ఆ అవకాశం లేదని యువ క్రికెటర్ విచారం వ్యక్తం చేశాడు. 'కై పో చె' సినిమాలో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ పాత్రలో దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్.. సుశాంత్‌తో కలిసి నటించాడు.

సుశాంత్‌కు ఓ మాటిచ్చా:

సుశాంత్‌కు ఓ మాటిచ్చా:

తాజాగా దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌‌తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 'సుశాంత్‌కు క్రికెట్‌ అంటే ఎంతో ఆసక్తి. 'కై పో చె' సినిమా షూటింగ్‌ చివరి రోజు సుశాంత్‌కు ఓ మాటిచ్చా. అదేంటంటే.. 'నేను మళ్లీ నిన్ను కలిసేది ఒక స్థాయి క్రికెటర్‌గా మారాకే' అని చెప్పా. ఆపై గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 వేలంలో ముంబై ఇండియన్స్‌కు ఎంపికయ్యా. చాలా ఆనందమేసింది. అప్పుడే సుశాంత్‌ను కలవాలనుకున్నా. కానీ కుదరలేదు. తర్వాత కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది' అని దిగ్విజయ్‌ చెప్పాడు.

ఇప్పుడు కలవాలని ఉన్నా అతడు లేడు:

ఇప్పుడు కలవాలని ఉన్నా అతడు లేడు:

'సుశాంత్‌ను ఇప్పుడు కలవాలని ఉన్నా అతడు లేడు. తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది. అయితే చివరిసారి కలవలేకపోయాననే బాధ నన్ను చాలా వేధిస్తోంది. సుశాంత్‌తో షూటింగ్‌ చేసేటప్పుడు నాకు వయస్సు 15 ఏళ్లు. ఆరు నెలల పాటు కలిసి ప్రయాణించాం. ప్రతిరోజు షూటింగ్‌ అయిపోయాక నన్ను తన గదికి పిలిచేవాడు. సినిమాలో ఎలా నటించాలనే విషయాలు నాకు నేర్పించేవాడు' అని దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్ పేర్కొన్నాడు.

 డిప్రెషన్‌ కారణంగా:

డిప్రెషన్‌ కారణంగా:

ముంబై ఇండియన్స్‌ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ గతరాత్రి ఓ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేసింది. దానికి అభిమానుల నుంచి వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌‌ గత ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్‌ కారణంగా 34 ఏళ్ల సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్‌ వర్గాలు విస్తుపోయాయి. ఈ మృతి నేపథ్యంలోనే అతడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ఈ ముంబై క్రికెటర్‌. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో మహీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు:

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు:

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన తొలి చిత్రం 'కై పో చె' అందరికీ గుర్తుండే ఉంటుంది. నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న ఈ చిత్రంలో ఇషాన్‌ పాత్రలో సుశాంత్‌ కనిపించగా.. అలీ అనే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ పాత్రలో మహారాష్ట్రకు చెందిన దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ నటించాడు.

'స్వింగ్‌ బౌలింగ్‌ ఊరికే రాలేదు.. నా స్వింగ్ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది'

Story first published: Friday, June 19, 2020, 15:11 [IST]
Other articles published on Jun 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X