Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'స్వింగ్‌ బౌలింగ్‌ ఊరికే రాలేదు.. నా స్వింగ్ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది'

The kind of swing I got doesn’t happen easily: Irfan Pathan recalls hat-trick against Pakistan

ఢిల్లీ: భారత క్రికెట్‌ చరిత్రలోని అపూర్వ ఘట్టాల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్ కూడా ఒకటి. 2006 జనవరిలో కరాచీ వేదికగా జరిగిన టెస్టులో స్వింగ్‌తో పాకిస్థాన్‌ను లెఫ్ట్ హ్యాండ్ పేసర్ బెంబేలెత్తించాడు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌తో చెలరేగాడు. పరుగుల ఖాతా తెరువకముందే టాప్ బ్యాట్స్‌మన్‌లు సల్మాన్‌ భట్‌, యూనిస్‌ ఖాన్‌, మహమ్మద్‌ యూసుఫ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఇప్పటికీ ఆ స్వింగ్‌ విన్యాసాన్ని క్రీడాభిమానులు తలుచుకుంటూనే ఉంటారు. తాజాగా ఆ హ్యాట్రిక్‌ను ఇర్ఫాన్‌ పఠాన్‌ గుర్తుచేసుకున్నాడు.

స్వింగ్‌ చేసి ఔట్‌ చేయాలనుకున్నా

స్వింగ్‌ చేసి ఔట్‌ చేయాలనుకున్నా

ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ... 'ఆ మ్యాచ్‌ నాకింకా గుర్తుంది. ఆరోజు తొలి ఓవర్‌ నేనే వేశా. క్రీజులో సల్మాన్‌ భట్‌, ఇమ్రాన్‌ ఫర్హత్‌లు ఉన్నారు. ఓవర్‌లో మూడు బంతులు పూర్తయ్యాయి. నాలుగో బంతిని స్వింగ్‌ చేసి భట్‌ను ఔట్‌ చేయాలని భావించా. నేను వేసిన బాల్‌ను భట్‌ డిఫెన్స్‌ ఆడాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని కెప్టెన్‌ రాహుల్ ద్రవిడ్ చేతిలోకి వెళ్లింది. నేనెలా అనుకుంటే అలానే జరిగింది' అని తెలిపాడు. భారత్ తరఫున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్‌ 100 వికెట్లు తీసుకోగా.. 120 వన్డేల్లో 173 వికెట్లతో రాణించాడు. ఇక 24 టీ20ల్లో 28 వికెట్లు పడగొట్టాడు.

హ్యాట్రిక్‌ సాధించాలనే ఉద్దేశంలో

హ్యాట్రిక్‌ సాధించాలనే ఉద్దేశంలో

'భట్‌ స్థానంలో వచ్చిన యూనిస్‌ ఖాన్‌ అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎలాగైనా సరే యూనిస్‌ను ఔట్‌ చేయాలనే లక్ష్యంతో మోకాలి ఎత్తులో ఇన్‌ స్వింగర్‌ వేయాలనుకున్నా. ఆ బంతి నా చేతుల్లో నుంచి వెళ్లినప్పుడే పర్‌ఫెక్ట్‌గా పడిందని తెలిసిపోయింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో రెండు వికెట్లు పడ్డాయి. ఇక హ్యాట్రిక్‌ సాధించాలనే ఉద్దేశంలో మరో ఇన్‌స్వింగర్‌ వేయాలనుకున్నా. నేను ఇన్‌స్వింగర్‌ వేస్తానని ముందే ఉహించిన యూసఫ్..‌ దానికి తగ్గట్లు సిద్ధమయ్యాడు. అయితే నేను కూడా ఊహించని విధంగా బంతి మరింత ఎక్కువ ఇన్‌స్వింగ్‌ అయి నేరుగా వికెట్లను గిరాటేసింది.యూసుఫ్‌ బౌల్డయ్యాడు, నా ఖాతాలో హ్యాట్రిక్‌ చేరింది' అని ఇర్ఫాన్‌ చెప్పాడు.

స్వింగ్‌ బౌలింగ్‌ నాకు ఊరికే రాలేదు

స్వింగ్‌ బౌలింగ్‌ నాకు ఊరికే రాలేదు

'స్వింగ్‌ బౌలింగ్‌ నాకు ఊరికే రాలేదు. దాని కోసం ఎన్నో రోజులు కష్టపడ్డా. ఇన్‌స్వింగర్ల ద్వారా హ్యాట్రిక్‌ తీసిన నాకు.. నా స్వింగ్‌ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది. ఆ హ్యాట్రిక్‌ ప్రపంచ రికార్డు అనే విషయం సచిన్‌ టెండూల్కర్‌ చెప్పేవరకు నాకు తెలియదు' అంటూ పఠాన్‌ చెప్పుకొచ్చాడు. కరాచీ టెస్టులో పఠాన్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 341 పరుగులు తేడాతో ఒడి సిరీస్‌ను 0-1తేడాతో కోల్పోయింది.

పఠాన్‌ సంచలనం

పఠాన్‌ సంచలనం

2006లో పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటన. టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు 'డ్రా' అయ్యాయి. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఏ జట్టు గెలువలేకపోయింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదని పిచ్‌లపై రెండు జట్లు అసంతృప్తిగానే ఉన్నాయి. అయితే కరాచీలో జరిగిన మూడో టెస్టు తొలి ఓవర్‌తోనే సీన్‌ మారిపోయింది. పఠాన్‌ ఏకంగా హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు.

'నీకు అబ్బాయిలు ఇష్టమా.. ఆ వివాదం మరచిపోవాలనుకుంటున్నా'

Story first published: Friday, June 19, 2020, 13:58 [IST]
Other articles published on Jun 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+