న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మురళీ విజయ్ చెప్పేదంతా అబద్ధం: ఎమ్మెస్కే

India vs West Indies 2018 : MSK Prasad Surprised At Murali Vijay's 'Lack Of Communication'
Surprised that Murali Vijay is talking about lack of communication: Chief selector MSK Prasad

హైదరాబాద్: ఏ మాత్రం సమాచారం లేకుండానే భారత సెలక్టర్లు తనపై వేటు వేశారని మురళీ విజయ్ అంటున్నాడు. అయితే ఈ మాటలు వట్టి అవాస్తవం అంటూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపడేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో మురళీ విజయ్‌ ఘోరంగా విఫలమైయ్యాడు. దాంతో సెలక్టర్లు అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షా‌ని ఎంపిక చేశారు.

విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెస్కే:

విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెస్కే:

ఇలా జట్టు నుంచి తప్పించే ముందు సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మురళీ విజయ్ గురువారం ఆవేదన వ్యక్తం చేశాడు. అతనితో పాటు ఇటీవల కరుణ్ నాయర్‌, హర్భజన్ సింగ్ కూడా సెలక్టర్ల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. మురళీ విజయ్ వ్యాఖ్యలపై తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

వాస్తవానికి ఆ వయసులో బంతిని బలంగా బాదలేరు: సచిన్

సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం.

సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం.

జట్టు నుంచి మురళీ విజయ్‌ని తప్పించేటప్పుడు అతనికి సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం. జట్టు ఎంపిక సమయంలో నా సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ ఓపెనర్ మురళీ విజయ్‌తో మాట్లాడాడు. అతడ్ని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో కారణం కూడా సవివరంగా చెప్పాడు. కానీ.. మురళీ విజయ్ తనకి సమాచారం ఇవ్వలేదని అంటూండటం నన్ను ఆశ్చర్యపరిచింది.

నాలుగు ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే:

నాలుగు ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే:

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడిన మురళీ విజయ్ నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 26 మాత్రమే. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. దీంతో.. మూడో టెస్టులో అతనిపై వేటు పడగా.. చివరి రెండు టెస్టుల్లో కనీసం జట్టులోకి కూడా సెలక్టర్లు ఈ ఓపెనర్‌ని ఎంపిక చేయలేదు.

 మాటమాత్రమైనా చెప్పక సరైన వివరణ:

మాటమాత్రమైనా చెప్పక సరైన వివరణ:

2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన మురళీ విజయ్, 2018లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ నుంచి మురళీ విజయ్‌ను సెలక్టర్లు తప్పించారు. ఈ సందర్భంగా మూడో టెస్టు నుంచి నన్ను తప్పించే సమయంలో చీఫ్ సెలక్టరే కాదు.. ఎవరూ నాతో కనీసం మాటమాత్రమైనా చెప్పలేదు. అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఆ సిరీస్‌లో వేటు పడటంపై నాకు సరైన వివరణ రాలేదు" అని మురళీ విజయ్ అన్నాడు.

Story first published: Friday, October 5, 2018, 14:21 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X