వాస్తవానికి ఆ వయసులో బంతిని బలంగా బాదలేరు: సచిన్

హైదరాబాద్: అరంగ్రేట మ్యాచ్‌లోనే సెంచరీ బాదేసిన పృథ్వీ షా రికార్డులతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతోన్న భారత్-వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 99బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసేశాడు. దీంతో అతనికి క్రికెట్ అభిమానుల నుంచి దిగ్గజ క్రికెటర్‌ల వరకూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

పృథ్వీ షా చాలా వేగంగా నేర్చుకుంటాడు
ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. 'తప్పిదాల నుంచి వేగంగా పాఠాలు నేర్చుకోవడమే భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బలమని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ‘పృథ్వీ షా చాలా వేగంగా నేర్చుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే అలా నేర్చుకునే లక్షణం ఆటగాడిలో ఉండాలి. 18 ఏళ్ల వయసులోనే కంటికి, చేతికి మధ్య అతను చూపిస్తున్న సమన్వయం అద్భుతం.'
INDvWI: లంచ్ విరామానికి టీమిండియా 506/5, కోహ్లీ సెంచరీ

టెక్నిక్‌తో పృథ్వీ షా బంతిని కొడుతున్నాడు
'వాస్తవానికి ఆ వయసులో బంతిని బలంగా బాదలేరు. కానీ.. టెక్నిక్‌తో పృథ్వీ షా బంతిని కొడుతున్నాడు. ఆ టెక్నిక్ అందరికీ రాదు.. పృథ్వీ షాకి మాత్రం సహజ సిద్ధంగా వచ్చింది. వేగంగా నేర్చుకోవడం, పరిస్థితుల్నిఅర్థం చేసుకోవడం పృథ్వీ షా బలం'అని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు.

మెరుపు సెంచరీతో రికార్డుల మోత
రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల పృథ్వీ షా (134) 154 బంతుల్లో 19ఫోర్లతో మెరుపు సెంచరీతో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.

తడబడుతున్న తరుణంలో స్వేచ్ఛగా బ్యాట్
సీనియర్ బ్యాట్స్‌మెన్ సైతం తడబడుతున్న తరుణంలో స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన పృథ్వీ షా.. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్‌లోని కష్టతరమైన షాట్లని సైతం అలవోకగా ఆడేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. షా తో పాటుగా ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్ ఎల్బీగా డకౌట్ అయి వెనుదిరిగాడు. అలాంటి సమయంలోనూ బౌలర్లను సమయోచితంగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications