
బ్యాటింగ్ ప్రాక్టీస్:
యువ క్రికెటర్ ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్న సురేశ్ రైనా.. తాజాగా నెట్స్‌లో జట్టు సహచరులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గత ఏడాది నుంచి క్రికెట్‌కు దూరమైన అతడు మునపటిలా రాణించాలని జట్టు సభ్యులతో కలిసి కఠోర సాధన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలను ఎప్పటికప్పుడు తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా జిమ్‌లో దిగిన ఫొటోని కూడా రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

వ్యక్తిగత కారణాలతో దూరం:
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా దూరంకావడంతో.. అతడు ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేదా? అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ దేశవాళీ క్రికెట్‌లో ఆడతాడని రైనా వెల్లడించడంతో.. ఐపీఎల్‌లో 'చిన్న తలా' ఉంటాడని సమాచారం తెలుస్తోంది. అయితే గత సీజన్‌లో రైనా గైర్హాజరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. స్థాయికి తగ్గట్టుగా ఆ జట్టు ప్రదర్శనలు చేయలేక తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిబాట పట్టింది.

రైనాపై కాసుల వర్షం:
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి సురేష్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడంతో.. అతనిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ గుర్రుగా ఉంది. రైనాను ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట వేలంలోకి వదిలిపెట్టే సూచనలు మెండుగానే ఉన్నాయి. అదే జరిగితే.. రైనా కోసం మిగిలిన ఫ్రాంఛైజీలు భారీ స్థాయిలో పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021లోకి మరో రెండు జట్లని చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు వచ్చే ఏడాది ఆరంభంలో మెగా వేలం జరగనుంది. దాంతో కచ్చితంగా రైనాపై కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోలేదు.
India vs Australia: వైరల్ వీడియో.. ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు!!