Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: వైరల్ వీడియో.. ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు!!

BCCI posts Team India players fun drill

అడిలైడ్‌: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం డే/నైట్‌ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఒకరోజు ముందే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తుది జట్టుని ప్రకటించింది. ఇక డే/నైట్‌ టెస్టుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేశారు. ఆటగాళ్ల కసరత్తులకు సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారత ఫిజియో టీమిండియా ఆటగాళ్లతో కొన్ని యాక్టివిటీస్‌ను చేయించింది. మొదటి యాక్టివిటీలో ఆటగాళ్ల మధ్య కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు ఒకరినిమరొకరు చేతులతో తోసుకున్నారు. రెండో యాక్టివిటీ సెషన్‌లో క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేయించారు. ఈ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించారు. ఇక మూడో యాక్టివిటీలో ఇద్దరు ఆటగాళ్లను ఒక జంటగా విడదీసి.. కింద క్యాప్‌ను పెట్టి ఎవరు ముందుగా అందుకుంటే వారు గెలిచినట్లు.

టీమిండియా ఆటగాళ్ల యాక్టివిటీస్‌ను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'సరదాగా ఎవరైనా డ్రిల్ చేయాలని భావిస్తున్నారా?. అయితే నెట్ ‌సెషన్‌కు ముందు స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీ బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సిందే' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీ20 సిరీస్‌ గెలిచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా.. అద్భుత విజయంతో టెస్ట్ సిరీస్‌ను ఆరంభించాలని భావిస్తుంస్తోంది. మరోవైపు గాయాలతో సతమతవుతున్న ఆసీస్‌ మొదటి టెస్టులోనే ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

తొలి టెస్ట్‌లో ఆడ‌బోయే తుది జ‌ట్టును బీసీసీఐ బుధవారం ప్ర‌క‌టించింది. త‌న ట్విట‌ర్ ఖాతాలో 11 మంది ప్లేయ‌ర్స్ లిస్ట్‌ను పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌కు ఓపెన‌ర్లుగా మయాంక్ అగ‌ర్వాల్‌, పృథ్వి షా రానున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన శుభ్‌మ‌న్ గిల్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన రిష‌బ్ పంత్‌ను కాద‌ని వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు వృద్ధిమాన్ సాహాకు అప్ప‌గించారు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య ర‌హానే ఆడ‌నున్నారు. ఏకైక స్పిన్న‌ర్‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఉంటాడు. ముగ్గురు పేస్‌బౌల‌ర్లు ఉమేష్ యాద‌వ్‌, మ‌హ్మ‌ద్ ష‌మి, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది.

Story first published: Wednesday, December 16, 2020, 18:33 [IST]
Other articles published on Dec 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+