న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా లాక్‌డౌన్‌: సూపర్‌మ్యాన్ సాహా కష్టాలు చూశారా?

SunRisers Hyderabad Share Wriddhiman Sahas Fun Quarantine At Home

హైదరాబాద్: కరోనా మీద మన్నువడ.. ఎక్కడి నుంచి దాపురించిందో ఈ గత్తర పాడుగాను. 42 రోజులుగా ఇంటికే పరిమితమైన ప్రతీ ఒక్కరి ఆవేదన. ఇక క్రికెటర్లు బాధైతే వర్ణాతీతం. వారి జీవితంలో ఎన్నడు లేని విధంగా ఇంటికి పరిమితమయ్యారు. తొలుత కుటుంబ సభ్యులతో ఆస్వాదించినా.. రోజులు గడుస్తున్న కొద్ది తెగ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఈ గత్తరనే లేకుంటే ఈ పాటికి ఏంచక్కా.. ఐపీఎల్‌లో కిక్కిరిసిన ప్రేక్షక సమూహం మధ్య ఆటను ఆస్వాదించేవారు. టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున వికెట్ల వెనుకాల మైమరిపించే తన కీపింగ్ విన్యాసాలతో అబ్బూరపరిచేవాడు. కానీ ఏం చేస్తాం.. వికెట్ల వెనుకాల బంతులు అందుకోవాల్సినోడు.. ఈ గత్తర పుణ్యమా.. ఇళ్లు ఊడ్చుకుంటుండు.. అంట్లు తోముతుండు. ఇంటి పనులు చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నాడు.

కరోనా కారణంగా జిమ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులనే డంబెల్స్‌గా మార్చుకొని వ్యాయామం చేస్తున్నాడు. మైదానంలోకి వెళ్లి పరుగుత్తలేక ఇంట్లోనే ఉరుకుతుండు. అతని కరోనా కష్టాలను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ వీడియో రూపంలో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చింది. సూపర్ మ్యాన్ దినచర్య చూడండి అంటూ ట్వీట్ చేసింది.

ఇక 2018 నుంచి హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ బెంగాల్ ప్లేయర్.. కీపింగ్‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2018లో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పెషలిస్ట్ వికెట్ కీపర్.. 15.25తో 122 పరుగులే చేశాడు. గత సీజన్‌లో 5 మ్యాచ్‌లకే పరిమితమై 17.20 సగటుతో 86 రన్స్ చేశాడు.

కరోనా ఎఫెక్ట్: భారత స్టార్ ప్లేయర్లు కాస్త రైతు కూలీలుగా..కరోనా ఎఫెక్ట్: భారత స్టార్ ప్లేయర్లు కాస్త రైతు కూలీలుగా..

Story first published: Tuesday, May 5, 2020, 15:16 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X