న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ఎలెవన్ ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. ఆ స్టార్ ఆటగాడికి దక్కని చోటు!

Sunil Gavaskar picks SRH playing XI and leaves out Kane Williamson

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో పాల్గొనే సన్‌‌రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమ్ బలా బలహీనతలను విశ్లేషించిన ఈ మాజీ క్రికెటర్.. తుది జట్టును అంచనా వేసాడు. అయితే గత రెండు సీజన్లలో జట్టును నడిపించి అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్‌కు చేర్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు గవాస్కర్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు.

అందుకే విలియమ్సన్ నో చాన్స్..

అందుకే విలియమ్సన్ నో చాన్స్..

యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం కావడంతో విలియమ్సన్‌ను కాదని మహ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లను తుది జట్టులోకి తీసుకున్నానని గవాస్కర్ చెప్పుకొచ్చాడు

‘గత సీజన్‌లో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు ఓపెనర్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ సీజన్‌లో కూడా వారు కీలకం. యూఏఈ పిచ్‌ల దృష్ట్యా మ్యాచ్ విన్నర్లు అయిన అఫ్గాన్ ప్లేయర్స్ మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఇద్దరు అవసరమే. అటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఉపయోగపడతారు. ఈ నలుగురితో ఫారిన్ ప్లేయర్స్ కోటా పూర్తయింది. అందుకే కొన్ని మ్యాచ్‌లకు విలియమ్సన్ బెంచ్‌కు పరిమితంకాక తప్పదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మనీష్ పాండే‌కు మంచి అవకాశం..

మనీష్ పాండే‌కు మంచి అవకాశం..

ఇక ఫస్ట్ డౌన్‌లో మనీష్ పాండే, నాలుగులో అండర్ 19 క్రికెటర్ ప్రియమ్ గార్గ్, ఐదులో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, ఆరవ స్తానంలో వృద్ధిమాన్ సాహాలను తీసుకుంటున్నట్లు గావస్కర్ చెప్పుకొచ్చాడు. 2014 ఐపీఎల్ ఫైనల్లో సాహా సెంచరీ చేసాడని, అందుకే అతన్ని 6వ స్థానంలో తీసుకుంటున్నానని ఈ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు. ఆల్‌రౌండర్స్ నబీ, రషీద్ ఖాన్ ఫినిషర్స్ పాత్ర పోషిస్తారని తెలిపాడు.

ఇక ఈ ఐపీఎల్ పాండేకు మంచి అవకాశమని, భారత జట్టులో చోటు దక్కించేందుకు సువర్ణావకాశమని చెప్పుకొచ్చాడు. ‘ఈ ఐపీఎల్ మనీష్ పాండేకు మంచి అవకాశం. దుబాయ్ వేదికగా 2014లో జరిగిన ఐపీఎల్‌లో పాండే అద్భుతంగా ఆడాడు. అనుభవంతో పాటు సూపర్ ఫీల్డర్ అతను. భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది పాండేకు మంచి అవకాశం.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.

డేంజరస్ బౌలింగ్ అటాక్

డేంజరస్ బౌలింగ్ అటాక్

ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలింగ్ అటాక్ ఉన్నది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకేనని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు బౌలింగ్‌తో ఇతర ఫ్రాంచైజీలకు తిప్పలు తప్పవని హెచ్చరించాడు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, బసిల్ థంపీతో పేస్ దళాన్ని ఎంపిక చేసిన గవాస్కర్.. ఈ సీజన్‌లో బసిల్ థంపీ చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, బసిల్ థంపీలతో సన్‌రైజర్స్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. అతను 2018లో అద్భుతంగా రాణించాడు. గత సీజన్‌లో అంచనాలు అందుకోకపోయినా.. ఈ సారి చెలరేగుతాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ దళంతో ప్రత్యర్థులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే వారెంత నాణ్యమైన బౌలర్లో చాలా సార్లు నిరూపించుకున్నారు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

గవాస్కర్ ఎంపిక చేసిన తుది జట్టు:

గవాస్కర్ ఎంపిక చేసిన తుది జట్టు:

డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, బసిల్ థంపి.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సెప్టెంబర్ 21న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగే తొలి మ్యాచ్‌తో తమ ఐపీఎల్ 2020 జర్నీ ప్రారంభించనుంది. 2016 చాంపియన్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి డేవిడ్ వార్నర్ నేతృత్వంలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

Mumbai Indiansను వెంటాడుతున్న చెత్త రికార్డు.. గత 7 సీజన్లలో శుభారంభం లేదు!

Story first published: Saturday, September 19, 2020, 17:32 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X