న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆ గవాస్కర్ గాడిని తన్ని తరిమేయండి.. వాడు వాని వెకిలి కామెంట్రీ! ఫ్యాన్స్ ఫైర్!

Sunil Gavaskar Controversial Comments on Shimron hetmyer Wife Makes Fans Angry

హైదరాబాద్: భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరు జారాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ.. సరదాగా అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హెట్‌మైర్ సతీమణి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ హద్దులు ధాటి మాట్లాడాడు. దాంతో నెటిజన్లు గవాస్కర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదిగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..?

షిమ్రాన్ హెట్‌మైర్ ఇటీవలే పెటర్నీటీ లీవ్ మీద ఇంటికి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తన భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని భావించిన హెట్‌మైర్.. ఈ బ్రేక్ తీసుకున్నాడు. అతని సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై విధించిన 151 పరుగుల లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. హెట్‌మైర్ క్రీజులోకి వచ్చేసరికి రాజస్థాన్ విజయ సమీకరణం 52 బంతుల్లో 75 పరుగులుగా ఉంది. ఆ టైమ్‌లో కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ ...'ఇటీవలే హెట్‌మైర్ సతీమణి డెలీవరీ అయింది.. మరీ ఈ మ్యాచ్‌లో అతను రాజస్థాన్‌కు డెలివరీ చేస్తాడా?'అని అనాలోచిత వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు.. టీవీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.

సిగ్గుండాలి.. ఇంకిత జ్ఞానం లేదు..

హెట్‌మైర్ సతీమణి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. నీవు నీ చెత్త వ్యాఖ్యానం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఓ మూలనో కూర్చోక చెత్త వ్యాఖ్యనంతో ఆటగాళ్లను ఎందుకు కించపరుస్తున్నావ్? అంటూ నిలదీస్తున్నారు.

టీమిండియా కీలక ఆటగాడిగా సుదీర్ఘకాలం సేవలందించినా..ప్రపంచ క్రికెట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నా.. సునీల్ గవాస్కర్‌కు ఇంకిత జ్ఞానం లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలని, సునీల్ గవాస్కర్ కామెంటరీ అంత దరిద్రం మరొకటి లేదని విమర్శిస్తున్నారు. సునీల్ గవాస్కర్ బ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు.

అనుష్క బంతులంటూ..

ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యానం చేయడం సునీల్ గవాస్కర్ ఇదే తొలిసారి కాదు. గతంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ అనుష్క శర్మ ప్రస్తావన తీసుకొచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అనుష్క శర్మ చేతిలో చివాట్లు కూడా తిన్నాడు. విరాట్ బ్యాటింగ్ వైఫల్యాన్ని వివరిస్తూ.. లాక్‌డౌన్‌లో సరైన సదుపాయాలు లేక కోహ్లీ అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఇది డబుల్ మీనింగ్‌కు దారితీయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాను తప్పుడు అర్థంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, విరాట్,అనుష్క లాక్‌డౌన్‌లో సరదాగా క్రికెట్ ఆడిన వీడియోనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని కవరింగ్ ఇచ్చుకున్నాడు.

గెలిపించిన అశ్విన్..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ(57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. మెక్‌కాయ్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. అశ్విన్, బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 151 రన్స్ చేసింది. యశస్వీ జైస్వాల్(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 59), అశ్విన్ (23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 నాటౌట్)రాణించారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకీ రెండు వికెట్లు తీయగా..సిమర్జీత్ సింగ్, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, May 21, 2022, 10:29 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X