న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే మా కొంప ముంచింది : స్టీవ్ స్మిత్

Steve Smith blamed lost of 3 quick wickets in the middle over for Rajkot defeat


రాజ్‌కోట్ :
మిడిల్ ఓవర్లలో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతోనే పరాజయం పాలయ్యామని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 రన్స్‌తో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీసే నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ తడబడింది. స్మిత్(98), లుబషెన్(46) పోరాటంతో గెలుపు దిశగా దూసుకెళ్లిన ఆ జట్టు.. కుల్దీప్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో ఓటమికి తలొంచింది.

వారి వీడియోలను బాగా చూశా : రాహుల్వారి వీడియోలను బాగా చూశా : రాహుల్

గేమ్ ఛేంజర్ కుల్దీప్..

గేమ్ ఛేంజర్ కుల్దీప్..

ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ స్పందించాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ‘30 నుంచి 40 మధ్య ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఓడిపోయాం. భారీ లక్ష్య ఛేదనలో మిడిల్‌ ఓవర్లు ఎంతో కీలకం. ఈ ఓవర్లలో పరుగులు రాబట్టడంతో పాటు వికెట్లను కూడా కాపాడుకోవాలి. 30 ఓవర్ల పాటు మేం మంచి రన్‌రేట్‌ను కొనసాగించాం. వికెట్లు కూడా చేతిలో ఉండటంతో మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉందనుకాన్నం. కానీ 31 ఓవర్లో లబుషేన్‌ ఔటవ్వడం.. 38వ ఓవర్‌లో నాతో పాటు అలెక్స్‌ క్యారీ వెనుదిరగడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. కుల్దీప్‌ వేసిని బంతిని కట్‌ చేయబోయి ఔటయ్యాను. ఇక రాజ్‌కోట్‌ వన్డేల్లో గేమ్‌ చేంజర్‌ కుల్దీప్‌ యాదవవ్.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

లబుషేన్ సూపర్..

లబుషేన్ సూపర్..

వన్డేల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన లబుషేన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడని స్మిత్ కొనియాడాడు. ‘వన్డేల్లో లబుషేన్‌ ఆకట్టుకున్నాడు. అతడికి మంచి భవిష్యత్‌ ఉంది. టీమిండియాలో విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లు అద్భుతంగా ఆడారు.'అని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.

అనుష్కతో ఆ భంగిమలు ట్రై చేయలేదా?: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రచయిత్రి అశ్లీల ట్వీట్

రోహిత్ గాయంపై..

రోహిత్ గాయంపై..

ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రోహిత్ చివరి మ్యాచ్‌ ఆడకుంటే మీకు అడ్వాంటేజా అన్న ప్రశ్నకు అతను బాగుండాలనే కోరుకుంటామని స్మిత్ సమాధానమిచ్చాడు. రోహిత్ గాయం నుంచి కోలుకొని తదుపరి మ్యాచ్‌లో ఆడుతాడనుకుంటున్నా. అతను కోలుకోవాలనే మేం కోరుకుంటాం. ఒకవేళ అతను బరిలోకి దిగపోతే భారత్‌కు లోటే. ఎందుకంటే అతడి రికార్డులే ఇండియా టాపార్డర్‌లో అతనెంత కీలకమో చెబుతాయి. ఇక కీలక నిర్ణయాత్మక వన్డేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలవాలనుకుంటున్నాం'అని స్మిత్‌ తెలిపాడు. ఇక ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే రేపు(ఆదివారం) బెంగళూరులో జరగనుంది.

Story first published: Saturday, January 18, 2020, 17:32 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X