Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్కతో ఆ భంగిమలు ట్రై చేయలేదా?: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రచయిత్రి అశ్లీల ట్వీట్

‘It is not funny’ – Twitter slams an Indian author for her derogatory tweet on Virat Kohli and Anushka Sharma

హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి భావనా అరోరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అశ్లీల వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య. మూడు వన్డేల సిరిస్‌ జరుగుతోంది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించగా... రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది.

సాధారణంగా మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాల కోసం తొలి వన్డేలో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. దీంతో ఆ మ్యాచ్‌లో కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో పాటు టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరిస్‌లో నిలవాలంటే రెండో వన్డేలో తప్పక గెలవాలి.

తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తిరిగి తన యథాస్థానంలో బరిలోకి దిగాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో కోహ్లీ 78 పరుగులు చేయడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్పుని ప్రముఖ రచయిత్రి భావనా అరోరా సెక్స్ భంగిమలతో పోలుస్తూ ట్వీట్ చేశారు.

"ఆస్ట్రేలియన్లతో విరాట్ కోహ్లీ సరికొత్త పొజిషన్ల కోసం యత్నిస్తూ తనతో మాత్రం ఆ పని చేయకపోవడంపై అనుష్క ఆగ్రహంతో ఉంది" అంటూ ట్విట్టర్‌లో కామెంట్ పెట్టింది. ఈ బూతు ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. భావన అరోరాకు మతి చెడిపోయిందని, ఆమెను గంగలో ముంచాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

మరొక నెటిజన్ కోహ్లీని తిట్టాలనుకుంటే తిట్టొచ్చుగాని, మధ్యలో అనుష్కను, పొజిషన్లను లాగడం ఎందుకని ప్రశ్నించాడు. కోహ్లీ కొత్త పోజిషన్లను ట్రై చేయడం లేదంటూ అనుష్క శర్మ నీకు మెసేజ్ చేసిందా? అంటూ ఇంకొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Story first published: Saturday, January 18, 2020, 16:10 [IST]
Other articles published on Jan 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+