న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డ్రగ్స్ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్!

Sri Lankan cricketer detained for possessing drugs, sent to two-week police remand

కొలంబో: శ్రీలంక క్రికెటర్ శేహన్ మధుశంక ఆదివారం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మరో వ్యక్తితో కారులో ప్రయాణిస్తున్న శేహన్ మధుశంకను పన్నాల పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది. దీంతో అతనిపై నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నాడని, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడనే అభియోగాలతో కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతన్ని రెండువారాల రిమాండ్‌లో ఉంచాల్సిందిగా మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించినట్లు అక్కడి స్థానిక న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

శ్రీలంక తరఫున ఏకైక వన్డే, రెండు టీ20లు మాత్రమే ఆడిన శేహన్.. 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్ పడగొట్టిన తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం బంగ్లాదేశ్‌పైనే రెండు టీ20లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. ఇక కరోనా వైరస్ కట్టడిలో భాగంగా శ్రీలంకలో లాక్‌డౌన్ కొనసాగిస్తుండగా.. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 1100 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక ఈ మహమ్మారి బారిన పడి కేవలం 10 మంది మాత్రమే చనిపోయారు.

టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ‌కు ఇవ్వాలి: మాజీ క్రికెటర్టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ‌కు ఇవ్వాలి: మాజీ క్రికెటర్

Story first published: Monday, May 25, 2020, 18:57 [IST]
Other articles published on May 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X