న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఖలీల్ కిదర్ హై! అతను ముసల్మాన్ కాదా? మండిపడుతున్న ఫ్యాన్స్!

SRH Social Media Handle Trolled By Sunrisers Fans For Not Wishing Khaleel Ahmed On EID
SRH పై మళ్ళీ గుర్రుమన్న ఫ్యాన్స్.. No IPL బట్ చివాట్లు మాత్రం కామన్!! || Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానులు మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన ఆ జట్టు.. కరోనాతో లీగ్ వాయిదా పడినా అభిమానుల చేత తిట్లు తింటూనే ఉంది. రంజాన్ పర్వదినాన ఆ టీమ్ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా జట్టులోని ముస్లిం క్రికెటర్లు అయిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అబ్డుల్ సమద్, ముజీబ్ ఉర్‌రెహ్మాన్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విషెస్ తెలియజేసింది.

వీరి ఫొటోలను సైతం షేర్ చేసింది. అయితే ఇక్కడే సన్‌రైజర్స్ హైదరాబాద్ పప్పులో కాలేసింది. జట్టులోని ఇతర ముసల్మాన్ క్రికెటర్లు అయిన ఖలీల్ అహ్మద్‌, షాబాజ్ నదీమ్‌లను మరిచిపోయింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదిరిపోయిందంతే..

అయితే రంజాన్ పర్వదినాన్ని పురుస్కరించుకొని మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, ముజీబ్ ఉర్‌ రెహ్మాన్ ఎలా జరుపుకుంటున్నారనే విషయాన్ని తెలిజేసే ఉద్దేశంతో సన్‌రైజర్స్ ఈ ట్వీట్ చేసింది. పండుగ సందర్భంగా వారి లుక్స్ అదిరిపోయానని, భద్రంగా పండుగ జరుపుకోవాలని క్యాప్షన్‌గా పేర్కొంది.

ఈ ఫొటోల్లో మహ్మద్ నబీ తన పిల్లలతో ఉండగా.. రషీద్, ముజీబ్, సమద్ కొత్త బట్టల్లో జిగేల్‌మన్నారు. అయితే పండుగకు సంబంధించిన ఖలీల్‌, నదీమ్ ఫొటోలు లేకపోవడంతో సన్‌రైజర్స్ వారిని విస్మరించినట్లుంది. కానీ అభిమానులు మాత్రం వీరిని ఉద్దేశపూర్వకంగానే టీమ్‌మేనేజ్‌మెంట్ మరిచిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.

ఖలీల్ కిదర్‌ హై..

హలో.. సన్‌రైజర్స్ ఖలీల్ అహ్మద్ కిదర్ హై? అతను ముసల్మాన్ కాదా? పండుగ శుభాకాంక్షలు చెప్పరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఫన్నీ క్యాప్షన్‌తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎలాగు ఉండడని పక్కనపెట్టేసావా? అని మరొకరు సెటైరిక్‌గా కామెంట్ చేశారు. షాబాజ్ నదీమ్‌ను కూడా పక్కనపెట్టేసారని, అతను కూడా ముసల్మాన్ క్రికెటరేనని కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ ట్విటర్ హ్యాండిల్ చూసేవాడికి మతిపోయిందేమోనని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఒక్క విజయం..

ఒకే ఒక్క విజయం..

ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడు మ్యాచ్‌ల్లో దాదాపు 6 మ్యాచ్‌లు సులువుగా విజయం సాధించేవే. కానీ మిడిలార్డర్ వైఫల్యంతో గెలుపు ముంగిట బోల్తా పడింది.

విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, విరాట్ సింగ్ చెత్త బ్యాటింగ్‌తో సునాయసంగా గెలిచే మ్యాచ్‌ల్లో కూడా హైదరాబాద్ ఓటమిపాలైంది. టీమ్ వైఫల్యానికి తోడు మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలు కూడా జట్టు కొంప ముంచాయి. టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ణి చేస్తూ వార్నర్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా సన్‌రైజర్స్ రాత మారలేదు.

Story first published: Friday, May 14, 2021, 15:36 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X