న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కన్న బిడ్డ సమక్షంలో ప్రేయసిని పెళ్లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్!

SRH Pacer Sean Abbott ties knot with best friend Brier Neil

సిడ్నీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ సీన్ అబాట్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ నీల్‌ను సీన్ అబాట్ పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య బుధవారం ఈ వివాహ వేడుక జరగ్గా.. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్‌ అబాట్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.'నా 'ప్రేమ'ను నేను పెళ్లాడాను. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ బ్రియర్‌ అబాట్‌! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది'అంటూ ఉద్వేగపూరితమైన క్యాప్షన్ ఇచ్చాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌లో సీన్‌ అబాట్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతనికి తుది జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సీన్ అబాట్ తన ఖాతాలో ఓ వికెట్ వేసుకున్నాడు.

ఇక పెళ్లి సందర్భంగా సోషల్‌ మీడియాలో సీన్ అబాట్‌ దంపతులకు సన్ రైజర్స్‌ మేనేజ్‌మెంట్ శుభాకాంక్షలు తెలిపింది. 'మా రైజర్ జీవితంలో ఇదో ప్రత్యేకమైన రోజు'అంటూ సీన్ అబాట్ పెళ్లి ఫొటోలను సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.

ఇక సీన్ అబాట్‌ 2014లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్‌ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు. వన్డేల్లో మూడు వికెట్లు తీసిన సీన్ అబాట్.. 98 పరుగులు చేశాడు. టీ20ల్లో 5 వికెట్లు తీసి 17 పరుగులు చేశాడు. మధ్యలో ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన సీన్ అబాట్ మళ్లీ 2019లో రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌కు ముందు పాకిస్థాన్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో సీన్ అబాట్ బరిలోకి దిగాడు.

ఇక క్రికెట్ చరిత్రలోనే తీరని విషాదంగా ఆస్ట్రేలియా ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ మరణం మిగిలిపోయింది. అయితే సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ తగిలే ఫిలిప్ హ్యూస్ మరణించాడు. ఉద్దేశపూర్వకంగా సీన్ అబాట్ ఆ బౌన్సర్ వేయకున్నా.. అతని నేరుగా హ్యూస్ మెడకు బలంగా తాకింది. దాంతో మైదానంలోనే కుప్పకూలి కోమాలోకి పోయిన హ్యూస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది సీన్ అబాట్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లపాటు ఆ ఘటన వేదించడంతో అతను క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.

Story first published: Thursday, June 30, 2022, 18:48 [IST]
Other articles published on Jun 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X