న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA20 Player Auction: కోట్లు కుమ్మరించిన కావ్య పాప.. మళ్లీ జట్టు నిండా బౌలర్లే!

SRH Owner Kavya Maran Spends Crores Of Rupee In SA20 Player Auctions

కేప్‌టౌన్: సౌతాఫ్రికా 20 లీగ్‌ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ జోరు కనబర్చింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన కావ్య పాప.. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా బౌలింగ్ కోచ్ డేయిల్ స్టెయిన్‌తో కలిసి వేలంలో దూకుడు కనబర్చింది. సోమవారం కేప్ టౌన్ ఇంటర్నేషనల్ కన్వేన్షన్ సెంటర్‌‌లో జరిగిన సౌతాఫ్రికా 20 వేలంలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ ఫ్రాంఛైజీ... ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించింది.

9.2 మిలియన్ డాలర్లు..

సౌతాఫ్రికా యువ వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్‌ కోసం ఏకంగా 9.2 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లను ఖర్చు చేసింది. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ కేప్ టౌన్, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్లు కూడా ట్రిస్టన్ స్టబ్స్ కోసం గట్టిగా పోటీపడ్డాయి. కానీ వదిలేది లేదంటూ పాట పాడిన కావ్య పాప.. చివరకు 9.2 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడే ట్రిస్టన్ స్టబ్స్, సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కి ఆడబోతున్నాడు. స్టబ్స్‌ ఇప్పటిదాకా 160.65 స్ట్రైయిక్ రేటుతో 784 టీ20 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ స్టబ్స్‌కి చోటు దక్కింది.

మరోసారి బౌలర్లతోనే..

సౌతాఫ్రికా యువ బౌలర్ మార్కో జాన్సెన్‌ను 6.10 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడే మార్కో జాన్సెన్ కోసం అన్ని జట్లు ఆసక్తి చూపించాయి. వేన్ పార్నెల్‌ని 5.6 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు కొనుగోలు చేసింది ప్రిటోరియా క్యాపిటల్స్. 24 ఏళ్ల వికెట్ కీపర్ డొనవన్ ఫెర్రీరియాని జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ 5.6 మిలియన్ల సౌతాఫ్రికా డాలర్లకు దక్కించుకుంది.

ఏకైక భారతీయుడికి నో చాన్స్..

ఏకైక భారతీయుడికి నో చాన్స్..

జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్టులో ఫాఫ్ డుప్లిసిస్, మహీశ్ తీక్షణ, రొమారియా షిఫర్డ్, జన్నెమన్ మలాన్, అల్జెరీ జోసఫ్ వంటి ప్లేయర్లకు చోటు దక్కింది. పర్ల్ రాయల్స్ టీమ్‌లో జోస్ బట్లర్, ఒబెడ్ మెకాయ్, డేవిడ్ మిల్లర్, లుంగ ఎంగిడి,తంబ్రేజ్ షంసీ, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ వంటి సీనియర్లకు చోటు దక్కింది. సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌తో పాటు వైట్ బాల్ కెప్టెన్ టెంబ బవుమా కూడా సౌతాఫ్రికా20 వేలంలో అమ్ముడుపోకపోవడం విశేషం. అలాగే సౌతాఫ్రికా20 వేలంలో పాల్గొన్న ఏకైక భారతీయుడు ఉన్ముక్త్ చంద్‌ని కొనుగోలు చేయడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు

సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు

ఎయిడెన్ మార్క్‌రమ్, ఒట్‌నీల్ బార్టామ్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, సిసండా మగల, జునైద్ దావూద్, మాసన్ క్రేన్, జేజే స్మట్స్, జోర్డాన్ కాంక్స్, ఆడమ్ రాసింగ్టన్, రోలోఫ్ వాన్ డెర్ మార్వె, మార్కూస్ అకెర్మాన్, జేమ్స్ ఫుల్లర్, టామ్ అబెల్, అయా గక్వామనే, సరెల్ ఎర్వీ, బ్రిడన్ కేర్స్

Story first published: Tuesday, September 20, 2022, 15:51 [IST]
Other articles published on Sep 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X