న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్ పోకిరి స్పూఫ్‌.. చెప్పలేరంటూ అభిమానుల‌కు స‌వాల్!

SRH Captain David Warner challenge his fans find his getup through Instagram

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన విషయం తెలిసిందే. అది కూడా టాలీవుడ్ సాంగ్స్‌కు చిందేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. సతీమణి క్యాండీస్‌తో వరుస పెట్టి టాలీవుడ్ టాప్ హీరోల సాంగ్స్ చేసిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్.. అందరి హీరోల అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

డ్యాన్స్‌లతో పాటు డైలాగ్స్ చెప్పి టాప్ హీరోలు, డైరెక్టర్స్ చేత ప్రశంసలతో పాటు ఆఫర్లు అందుకున్నాడు. ఇక భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ నిషేధం విధించడం.. ఆ వెంటనే ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లడంతో వార్న‌ర్ హ‌వా కాస్త త‌గ్గిన‌ప్ప‌టికి తాజాగా మ‌రోసారి త‌న స‌ర‌దా స్పూఫ్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముందుకొచ్చాడు. అంతేకాకుండా తన అభిమానుల‌కు ఒక‌ స‌వాల్ కూడా విసిరాడు.

'నేను చెప్పిన డైలాగ్ ఏ హీరోదో ... ఎవ‌రి వేషంలో ఉన్నానో చెప్పాలి.. నేను బెట్ వేయ‌గ‌ల‌ను.. మీరు చెప్ప‌లేరు'అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే ఆ వీడియో స్పూఫ్ ఎవరిదో కాదు.. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబుది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండ‌స్ట్రీ హిట్ పోకిరి సినిమాలోనిది. 'రివాల్వర్ దొరికిందని చెప్పానే.. అది నాదే..'అని మహేశ్ బాబు చెప్పే డైలాగ్ సీన్‌ను, ఓ సాంగ్ ఎక్స్‌ప్రెషెన్‌ను వార్నర్ స్పూఫ్ చేశాడు.

కేవ‌లం ఫేస్ మార్ఫింగ్‌ను మాత్ర‌మే చేసిన వార్న‌ర్‌ డైలాగ్‌ను మ్యూట్ చేశాడు. ఈ స్పూఫ్‌ను అభిమానులు ఇట్టే పసిగట్టేస్తారు. అయితే మ‌హేష్ బాబు పేరు తెలియ‌ని విదేశియులకు మాత్రం వార్న‌ర్ విసిరిన స‌వాల్ కొంచెం క‌ష్టంగానే ఉంటుంది. అయితే ఈ వీడియోపై మహేశ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
మహేశ్ బాబు అంటే వార్న‌ర్‌కు ఎన‌లేనంత అభిమానం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతకు ముందు తన కూతురు మాస్క్‌తో పాట పాడిన వీడియోను షేర్ చేశాడు.

CPL 2020: 48 ఏళ్ల వయసులో సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించిన ప్రవీణ్ తాంబేCPL 2020: 48 ఏళ్ల వయసులో సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించిన ప్రవీణ్ తాంబే

Story first published: Thursday, September 3, 2020, 20:10 [IST]
Other articles published on Sep 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X