'ఆర్చర్ ఇంగ్లండ్‌కు గొప్ప ఆయుధం.. అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి'

లార్డ్స్: యువ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో ఇంగ్లండ్‌కు గొప్ప ఆయుధం లభించింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆర్చర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సూచించాడు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడడంతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆర్చర్ ఆరంగేట్రం చేసాడు. అరంగేట్ర టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆర్చర్ అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లచే కొనియాడబడుతున్నాడు. ఆర్చర్ మోస్ట్ డేంజరస్ బౌలర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జాగ్రత్తగా కాపాడుకోవాలి:
తాజాగా షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఆర్చర్‌కు అమోఘమైన ప్రతిభ ఉంది. అతను అరుదైన ఆటగాడు. ఇంగ్లాండ్ అమ్ములపొదిలో ఉన్న అసలు సిసలు పేస్ బౌలర్. ఆర్చర్ రూపంలో ఇంగ్లండ్‌కు గొప్ప ఆయుధం లభించింది. అతను బలంగా ఉన్నాడు. అయితే ఇతని బంతులకు చాలా మంది బలవుతారని అనుకుంటున్నా. అతని బౌలింగ్ శైలి, వేగం చూస్తే గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆర్చర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి' అని అక్తర్ సూచించాడు.
తక్కువ మ్యాచులలో ఆడడం ఉత్తమం:
'ఆర్చర్ తక్కువ మ్యాచులలో ఆడడం ఉత్తమం. అతను ఒక ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు బౌలింగ్ చేయకూడదు. యాషెస్ ఇప్పుడు ఒక మలుపు తిరుగుతుందని అనుకుంటున్నా. ఫాస్ట్ బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంటుంది. స్మిత్ మెడపై గాయం అయినపుడు ఆర్చర్.. స్మిత్ దక్కరకు వెళ్ళాడని నమ్ముతున్నా. ఆర్చర్ సానుభూతి కలిగి ఉండాలి' అని అక్తర్ అన్నాడు.

బార్బడోస్‌లో జన్మించి ఇంగ్లాండ్‌కు ఆడుతున్నాడు:
బార్బడోస్‌లో జన్మించిన ఈ యువ ఆటగాడు విండీస్ అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంతో ఇంగ్లాండ్‌కు వచ్చి క్లబ్ క్రికెట్ ఆడడంతో వెలుగులోకి వచ్చాడు. ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా.. నేరుగా ఇంగ్లాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఆడి అత్యధిక వికెట్లు సాధించాడు. ఇప్పటివరకు ఆర్చర్ 14 వన్డేలు, ఒక టెస్టు, ఒక టీ20 ఆడాడు.
'టీమిండియాకు ఆడని సమయంలో లైన్ అండ్ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించా'

ఇప్పటికే 20 మంది బ్యాట్స్‌మన్ బలి:
ఆర్చర్ ఇప్పటికే 20 మంది బ్యాట్స్‌మన్ తల లేదా శరీరాన్ని తన బౌన్సర్లతో తాకించాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లాను మైదానంలోనే కుప్పకూలిపోయేలా చేసాడు.ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆర్చర్ బౌన్సర్లను పరిచయం చేశాడు. ఆర్చర్ బౌన్సర్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హెల్మెట్ ఎగిరి కిందపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications