డబ్బులు కాదు గౌరవం కోసం ఆడతారు.. ఆ బేకార్ మాటలు మాట్లాడకండి: సౌరవ్ గంగూలీ

న్యూఢిల్లీ: క్రీడాకారులు ఎప్పుడూ ఆట వల్ల పొందే హోదా, దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నామనే గౌరవం కోసం ఆడుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. కేవలం డబ్బుల కోసం ఎవరూ ఆడరని తెలిపాడు. ఇలాంటి అర్థ రహిత వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని అసహనం వ్యక్తం చేశాడు. వచ్చే ఐదేళ్లుకు సంబంధించిన (2023-27) ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.48,390 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్ కొనుగోలు చేయగా.. డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్18 దక్కించుకుంది.

మీడియా ప్రసార హక్కులు భారీ ధర పలకడంతో ఆటగాళ్లు డబ్బుకు ప్రాధాన్యతనిచ్చి అంతర్జాతీయ మ్యాచ్‌లాడడం కంటే ఐపీఎల్ పై ఎక్కువ దృష్టి సారిస్తారేమోననే ప్రచారం జరుగుతుంది.

గవాస్కర్ నుంచి కుంబ్లే వరకు..

గవాస్కర్ నుంచి కుంబ్లే వరకు..

ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సౌరవ్ గంగూలీ దీటుగా బదులిచ్చాడు.'ఆటగాళ్ల ప్రదర్శనకు డబ్బుకు సంబంధం ఉండదు. సునీల్‌ గవాస్కర్‌ నుంచి అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ వరకు.. అప్పుడు ఆ ఆటగాళ్లు అందుకున్న మొత్తం ఇప్పడు క్రికెటర్లకు లభిస్తున్న దాంతో పోలిస్తే దరిదాపుల్లో కూడా లేదు. కానీ వాళ్లందరికీ అప్పుడు పరుగులు చేయాలనే ఆకలి ఉండేది. ఆటగాళ్లు కేవలం డబ్బు కోసమే ఆడతారని అనుకోను. ఆట వల్ల పొందే హోదా, దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నామనే గౌరవం కోసం ఆడతారు. పెద్ద అంతర్జాతీయ టోర్నీలను గెలవాలని ప్రతి ఒక్క ఆటగాడు అనుకుంటాడు'' అని దాదా చెప్పాడు.

రెండేళ్ల క్రితమే ప్లాన్..

రెండేళ్ల క్రితమే ప్లాన్..

ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ మొత్తం లభించడంపై స్పందిస్తూ.. ''ప్రసార హక్కుల అమ్మకం కోసం రెండేళ్ల క్రితమే ప్రణాళిక మొదలైంది. నిశితంగా పరిశీలించి దీన్ని తయారు చేశాం. ఈ ఏడాది భారత క్రికెట్‌కు ఎంతో గొప్పది. దేశవాళీ సీజన్‌ను ముగించబోతున్నాం. అభిమానుల సమక్షంలో ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా నిర్వహించాం. ఇప్పుడీ ప్రసార హక్కుల కోసం మెగా ఒప్పందం కుదిరింది.

74 మ్యాచ్‌లే..

74 మ్యాచ్‌లే..

అందులో భాగమైన డిస్నీ స్టార్‌, వయాకామ్‌18, టైమ్స్‌ ఇంటర్నెట్‌కు అభినందనలు. ద్వైపాక్షిక సిరీస్‌లతో ఇతర దేశాలకు ఆదాయం వస్తుంది కాబట్టి వచ్చే రెండేళ్లు ఐపీఎల్లో 74 మ్యాచ్‌ల చొప్పునే నిర్వహిస్తాం. ఆ తర్వాత భవిష్యత్‌ పర్యటన ప్రణాళికపై దృష్టి సారించాలి'' అని గంగూలీ పేర్కొన్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 17, 2022, 9:47 [IST]
Other articles published on Jun 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X