న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్ పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు: మాజీ క్రికెటర్

Sohail Khan says Iske jaise toh bohot hain, domestic cricket bhari padi hai hamaari over Umran Malik

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ సెన్సేషన్, జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను చూసి భారత్ పొంగిపోతుందని, అలాంటి బౌలర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటారని ఆ దేశ మాజీ పేసర్ సోహైల్ ఖాన్ అన్నాడు. ఇటీవలే విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోహైల్ ఖాన్... ఈ సారి ఉమ్రాన్ మాలిక్‌పై నోరు పారేసుకున్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఉమ్రాన్ మాలిక్ వేగవంలమైన బౌలరే అయినప్పటికీ.. అలాంటి బౌలర్లు పాకిస్థాన్‌లో చాలా మంది ఉన్నారని, పాక్ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాడు.

గల్లీకొకడు ఉంటాడు..

గల్లీకొకడు ఉంటాడు..

'ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలరే. అతను ఆడిన రెండు, మూడు మ్యాచ్‌లు చూశాను. అతని బౌలింగ్ వేగం ఉంది. కానీ మిగతా విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. అయితే ఉమ్రాన్.. గంటకు 150-155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడని అంటున్నారు. అదేం గొప్ప కాదు. పాకిస్థాన్ లో అలాంటి బౌలర్లను 15- 20 మందిని చూపిస్తాను. దేశవాళీ క్రికెట్‌లో ఉమ్రాన్ మాదిరి వేగంగా బంతులు విసిరేవాళ్లూ ఉన్నారు. మీరు ఒకసారి లాహోర్ ఖలాండర్స్ నిర్వహించే ట్రయల్స్‌కు వెళ్లి చూడండి. అక్కడ ఉమ్రాన్ వంటి బౌలర్లు కోకొల్లలుగా కనిపిస్తారు.

పాక్ దేశవాళీ క్రికెట్ చూస్తే..

పాక్ దేశవాళీ క్రికెట్ చూస్తే..

దేశవాళీ స్థాయి నుంచి వచ్చే బౌలర్లు అక్కడే రాటుదేలి వస్తారు. పాకిస్థాన్ జాతీయ జట్టులో ఇప్పుడున్న షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్.. వీళ్లంతా దేశవాళీలో రాటుదేలినవాళ్లే. ఇలాంటి వాళ్ల పేర్లు నా దగ్గర బోలెడన్నీ ఉన్నాయి. కానీ వాళ్లింకా డొమెస్టిక్ క్రికెట్ లోనే మగ్గిపోతున్నారు.'అని తెలిపాడు. సోహైల్ చెప్పినట్టు ఉమ్రాన్ మాదిరిగా అత్యంత వేగంతో బంతులు సంధించే బౌలర్లు పాకిస్థాన్ లో ఉన్నారో లేదో తెలియదు గానీ షోయబ్ అక్తర్ తర్వాత గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన పాక్ బౌలర్ మహమ్మద్ సమీ ఒక్కడే అనే విషయం మాత్రం అందరికి తెలుసు.

ఒక్కడు 150 మార్క్ ధాటలేదు..

ఒక్కడు 150 మార్క్ ధాటలేదు..

చాలా మంది పాకిస్థాన్ బౌలర్లు జట్టులోకి వచ్చి వెళ్లారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా అక్తర్ రికార్డుకు రీచ్ కాలేకపోయారు. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. గంటకు 145-148 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసినా 150 కిలోమీటర్ల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయారు. కానీ ఉమ్రాన్ మాలిక్ మాత్రం ఇప్పటికే గంటకు 155, 157 కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేస్తున్నాడు. త్వరలోనే అతను అక్తర్ రికార్డు (162 కి.మీ స్పీడ్)ను కూడా బ్రేక్ చేస్తానని హామీ ఇచ్చాడు.

Story first published: Saturday, February 4, 2023, 23:02 [IST]
Other articles published on Feb 4, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X