న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka: లంక టూర్ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్.. ధావన్‌కు లైన్ క్లియర్! ఇదే మొదటిసారి!

Shreyas Iyer likely to miss Sri Lanka series, Doors open for Shikhar Dhawan

ముంబై: జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నాడు. లంక పర్యటన కోసం జట్టుని ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమవుతుండగా.. శ్రేయాస్ సెలక్షన్‌కి అందుబాటులో ఉండటం లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. మరోవైపు గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

 శ్రేయాస్ ఔట్

శ్రేయాస్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయపడ్డాడు. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్‌ 8న అయ్యర్‌ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు అప్పుడే తేల్చేశారు. దీంతో లంక పర్యటన వరకు అతడు పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం లేదు. దాంతో శ్రీలంక టూర్‌కి శ్రేయాస్ దూరమవడం లాంఛనమైంది.

ధావన్‌కి లైన్ క్లియర్

ధావన్‌కి లైన్ క్లియర్

మూడు ఫార్మాట్ల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ టూర్‌లో ఉంటారు కాబట్టి .. శ్రీలంకలో భారత జట్టును నడిపించేదెవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త కెప్టెన్‌ ఎంపికపై బీసీసీఐ సెలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. కెప్టెన్‌గా మొదటి ప్రాధాన్యం భవిష్యత్‌ సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కే అని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.

అయితే అయ్యర్ తాజాగా సెలెక్షన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ పోటీలో ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి లైన్ క్లియర్ అయింది. ఇక దాదాపు టీమిండియాకు గబ్బర్ కెప్టెన్ అయినట్టే. అదే నిజమయితే ధావన్ మొదటిసారి జట్టుకు సారథ్యం వహించడం మొదటిసారి అవనుంది.

యే దిల్‌ మాంగే 'మూవర్‌' అంటున్న పంత్.. ఢిల్లీ కెప్టెన్ ఏంచేస్తున్నాడో చూడండి (వీడియో)!

 అయ్యర్‌ స్థానంలో ఎవరు

అయ్యర్‌ స్థానంలో ఎవరు

ఇంగ్లండ్ టూర్‌కి ఎంపికవని భారత క్రికెటర్లతో రెండో జట్టుని లంక పర్యటన కోసం బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించనున్నారు. ఇందులో శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉన్నారు. ఇప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ తప్పుకోవడంతో మరో యువ ఆటగాడికి అవకాశం రానుంది. అతడు ఎవరనేది తెలియాల్సి ఉంది.

జూలై 5న శ్రీలంకకు

జూలై 5న శ్రీలంకకు

సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. 2018లో ఆఖరిగా శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకకి వెళ్లిన తర్వాత టీమిండియా కనీసం వారం రోజులు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ వారంలో మూడు రోజులు ఆటగాళ్లు గదులకే పరిమితంకానుండగా.. మిగిలిన నాలుగు రోజులు హోటల్ పరిధిలోనే ప్రాక్టీస్, జిమ్‌ని వినియోగించుకునే వెసులబాటుని కల్పించనున్నారు.

Story first published: Wednesday, May 12, 2021, 12:24 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X