న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను ఆ మాటంటే సెహ్వాగ్ బతికేవాడా? మైదానంలోనే కొట్టేవాడిని: షోయబ్ అక్తర్

Shoaib Akhtar responds to Virender Sehwags baap baap hota hai anecdote

కరాచీ: మైదానంలో చోటుచేసుకున్న ఓ స్లెడ్జింగ్ ఘటనపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఖండించాడు. సెహ్వాగ్ చెప్పిందంతా ముమ్మాటికి అబద్దమని, అప్పటికప్పుడు సృష్టించిన కథని కొట్టిపారేసాడు. ఆ రోజు సెహ్వాగ్ అలా అని ఉంటే తన చేతిలో ఖతం అయ్యేవాడని తెలిపాడు.

 డబుల్ సెంచరీకి సమీపంగా..

డబుల్ సెంచరీకి సమీపంగా..

ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఓ కార్యక్రమంలో అక్తర్‌తో మైదానంలో చోటు చేసుకున్న ఓ స్లెడ్జింగ్ ఘటనను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఘటనను వివరిస్తూ.. సచిన్‌తో పాటు క్రీజులో ఉన్న తాను డబుల్ సెంచరీకి సమీపిస్తుండగా.. అక్తర్ బౌన్సర్లు సంధిస్తూ తనను పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, హుక్ షాట్ ఆడాలని సవాల్ విసిరాడని తెలిపాడు.

సచిన్‌ను చూపిస్తూ..

దీంతో సహనం కోల్పోయిన తాను నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ను చూపిస్తూ..‘ ‘వోహ్ తేరా బాప్ ఖాడా హై వో నాన్-స్ట్రైకింగ్ ఎండ్ పె, ఉస్ కో బోల్ వో మార్ కే డిఖాయేగా.'(నాన్‌ స్ట్రైకింగ్‌లో నీ అయ్య ఉన్నాడు.. ఆయనను అడుగు హుక్ షాట్ ఆడమని)అని చెప్పా. ఆ మరుసటి ఓవర్‌లోనే షోయబ్ వేసిన బౌన్సర్‌ను మాస్టర్ సిక్స్‌గా మలిచాడు. నేను వెంటనే అక్తర్‌తో ‘బెటా బెటా హోతా హై, బాప్ బాప్ హోతా హై'(కొడుకు ఎప్పుడు తండ్రిపై ఆధిపత్యం ప్రదర్శించలేడు)'అని చెప్పా'అని భారత్, పాక్ క్రికెటర్లు పాల్గొన్న ఆ షోలో షారుఖ్‌తో సెహ్వాగ్ అన్నాడు.

ఉరికించి కొట్టేవాడిని..

ఉరికించి కొట్టేవాడిని..

అయితే తాజాగా పాకిస్థాన్ జర్నలిస్ట్ సాజ్ సాధిక్ ఓ ఇంటర్వ్యూలో అక్తర్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా అతను ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ‘సెహ్వాగ్ నన్ను ఆ మాటంటే బతికి ఉండేవాడా? నేను వదిలేవాడినా? మైదానమంతా ఉరికించి కొట్టేవాడని, హోటల్లో కూడా చితక బాదేవాడిని'అని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలను సాజ్ సాధిక్ ట్వీట్ చేయగా వైరల్ అయింది. ఇక 2011లో తాను రాసిన ‘కాంట్రవర్సియల్లీ యువర్స్'అనే బుక్‌లో తన బౌలింగ్‌కు సచిన్ భయపడ్డాడని అక్తర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

అక్తర్-సచిన్ హోరాహోరీ..

అక్తర్-సచిన్ హోరాహోరీ..

ఇక మైదానంలో అక్తర్-సచిన్ మధ్య పోరు 1990-2000 అభిమానులకు సుపరిచితమే. పాక్ పేసర్ బౌలింగ్‌ను సచిన్ చీల్చిచిండాడటం.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సంధించిన బౌన్సర్లను అప్పర్ కట్ షాట్లతో సిక్స్‌లుగా మల్చడం అందరికీ చిరస్మరణీయం. కొన్నిసార్లు మాస్టర్ తడబడినా.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం అక్తర్‌పై సచిన్‌దే పై చేయి అనేది కాదనలేని సత్యం.

ఇక షోయబ్ ఉన్న పాక్ జట్టుతో 9 టెస్ట్‌లు ఆడిన సచిన్.. 41.60 సగటుతో 416 పరుగులు చేశాడు. అయితే సచిన్‌ను అక్తర్ మూడు సార్లు మాత్రమే ఔట్ చేశాడు. 19 వన్డేల్లో 45.47 యావరేజ్‌తో సచిన్ 864 రన్స్ చేయగా.. అక్తర్ ఐదు సార్లు ఔట్ చేశాడు.

ధోనీ ఇక తప్పుకో.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వు: మాజీ సెలెక్టర్

Story first published: Sunday, August 2, 2020, 14:37 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X