న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఇక తప్పుకో.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వు: మాజీ సెలెక్టర్

Roger Binny feels MS Dhoni past his best, has lost a bit of fitness

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురిం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ సెలెక్టర్ రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ధోనీ తక్షణమే క్రికెట్‌ నుంచి వైదొలగాలని సూచించాడు. బ్యాట్స్‌మన్‌గా మునుపటి సామర్థ్యాలను ప్రదర్శించలేకపోతున్న ధోనీ.. గత రెండేళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ మైదానానికి దూరమవగా.. అతని స్థానంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు వరుసగా అవకాశాలిస్తున్నారు.

ఇక ఏ తరహా క్రికెట్ ఆడని ధోనీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో టీమిండియాకు అతను ఆడటం కష్టమేనని అభిప్రాయాలు వినిపించాయి. గత ఏడాదికాలంగా ధోనీ రిటైర్మెంట్‌పై డిబేట్ జరుగుతూనే ఉంది. అయినా జార్ఖండ్ డైనమైట్ మాత్రం మౌనంగా ఉన్నాడు.

తాజాగా ధోనీ రిటైర్మెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో రోజర్ బిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కొన్ని సీజన్లుగా మహీ ఆటను గమనిస్తే.. అతడు ఉత్తమ ఆటగాడు అనే విషయం గతమేనని అవగతమవుతుంది. ఫిట్‌నెస్‌ కూడా ఒకింత కోల్పోయాడు. దేశ క్రికెట్‌లోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. ఇది గమనించి ధోనీ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది' అని అన్నాడు.

ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే రోజర్ బిన్ని సెలెక్టర్‌గా పనిచేశాడు. కెప్టెన్‌గా ధోనీ టీమ్ గురించి ఎప్పుడూ కూడా సెలెక్టర్లను ఒత్తిడి చేసింది లేదన్నాడు. సీనియర్ క్రికెటర్లకు కూడా చాలా గౌరవం ఇచ్చేవాడని గుర్తుచేసుకున్నాడు. రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఎక్కువ రోజులు జట్టులో కొనసాగలేకపోయిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 2, 2020, 12:38 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X