న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్.. కొంచెం ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar hits back Virender Sehwag over ‘chucking’ comment

కరాచీ: తాను త్రో వేసేవాడినంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంచె ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని చురకలంటించాడు. భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యేలా ఇరు దేశాల ఆటగాళ్లు మాటలు ఉండాలని సూచించాడు.

సోషల్ మీడియా యుగంలో ఏది పడితే అది మాట్లాడి ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచవద్దని విజ్ఞప్తి చేశాడు. సెహ్వాగ్‌కు ఐసీసీ కంటే ఎక్కువ తెలిస్తే.. అతను ఇలాంటి కామెంట్స్ చేయవచ్చని చురకలంటించాడు. తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. అక్తర్ త్రో బౌలింగ్ చేసేవాడని ఆరోపించాడు.

త్రో బౌలింగ్ చేసేవాడు..

త్రో బౌలింగ్ చేసేవాడు..

'అక్తర్‌ బంతులు సంధించేటప్పుడు మోచేతి కుదుపులకు లోనవుతుంది. దీంతో అతడు బౌలింగ్‌ కాకుండా త్రో వేసేవాడు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. లేకపోతే ఐసీసీ అతడిపై ఎందుకు నిషేధం విధిస్తుంది?. బ్రెట్‌ లీ బౌలింగ్‌ అంటే నాకు ఏ మాత్రం భయం ఉండేది కాదు. అతని మోచేయి సరిగ్గా తిప్పుతూ బంతిని బాగా సంధించేవాడు.

నేను బ్రెట్‌లీ బౌలింగ్‌ను ఈజీగా ఆడేవాడిని. అక్తర్‌ మాత్రం ఎప్పుడు ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమయ్యేది కాదు. అతని బౌలింగ్‌లో రెండు, మూడు ఫోర్లు కొడితే.. ఇక తర్వాతి బంతి నుంచి తలమీదకైనా లేదా యార్కర్లతో అరికాళ్లనైనా టార్గెట్‌ చేసేవాడు.'అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ కంటే ఎక్కువ తెలిస్తే..

ఐసీసీ కంటే ఎక్కువ తెలిస్తే..

ఈ వ్యాఖ్యలను అక్తర్ ముందు ప్రస్తావించగా.. అతను ఘాటుగా బదులిచ్చాడు. 'ఈ తరహా కామెంట్స్ చేయవద్దని సెహ్వాగ్‌ను కోరుతున్నా. ఐసీసీ కంటే సెహ్వాగ్‌కు ఎక్కువ తెలిస్తే ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. నేను మాత్రం అతనికి భిన్నంగా బదులిస్తున్నా. సెహ్వాగ్ భారత జట్టు అందించిన గొప్ప మ్యాచ్ విన్నర్. అతనుజట్టు మనిషి. భారత్ తరఫున ఆడిన గొప్ప ఓపెనర్లలో ఒకడు.

కించపరిచే వ్యాఖ్యలు చేయను..

కించపరిచే వ్యాఖ్యలు చేయను..

నేను ఉన్న పరిస్థితులు, వయసు నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా నా అభిప్రాయాలను పంచుకోవాల్సి ఉంది. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పట్ల నేను ఈ రకమైన కించపరిచే వ్యాఖ్యలు చేయను. సెహ్వాగ్ మాట్లాడిన ఆ ఇంటర్వ్యూ నేను చూడలేదు. సెహ్వాగ్ నాకు మంచి మిత్రుడు. కానీ అతను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడో లేక సీరియస్‌గా అన్నాడో నాకు తెలియదు.

ఒళ్లు దగ్గరపెట్టుకొని..

ఒళ్లు దగ్గరపెట్టుకొని..

ఇరు దేశాల ఆటగాళ్లను నేను కోరేది ఒక్కటే. భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యేలా వ్యాఖ్యలు చేయండి. అంతేగానీ ఇరు దేశాల మధ్య వైరం పెంచే కామెంట్స్ అస్సలు చేయవద్దు. సోషల్ మీడియా కాలంలో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని సెహ్వాగ్‌ను కోరుతున్నా'అని అక్తర్ స్పోర్ట్స్ కీదా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 21, 2022, 17:38 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X