న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క తప్పిదమే మా కొంపముంచింది: శిఖర్ ధావన్

Shikar Dhawan says We bowled too short against Tom Latham After India loss against New Zealand

అక్లాండ్: మైదాన పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఎక్కువగా షాట్ ఆఫ్ లెంగ్త్ బాల్స్ వేయడం కొంపముంచిందన్నాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. టామ్ లాథమ్ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని చెప్పాడు. మైదాన పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో విఫలమయ్యామని చెప్పిన ధావన్.. 40వ ఓవర్ టర్నింగ్ పాయింట్ అయ్యిందన్నాడు.

ఆ ఒక్క ఓవర్..

ఆ ఒక్క ఓవర్..

'మేం మంచి లక్ష్యాన్ని నమోదు చేశామని అనుకున్నాం. తొలి 10-15 ఓవర్లలో బంతితో అద్భుతంగా రాణించాం. ఇతర గ్రౌండ్లకు అక్లాండ్ మైదానం విభిన్నమైనది. ఈ గ్రౌండ్‌కు తగ్గట్లు ప్రణాళికలు రచించాల్సింది. మేం ఎక్కువగా షాట్ బాల్స్ వేసి మూల్యం చెల్లించుకున్నాం. టామ్ లాథమ్ మాపై ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ముఖ్యంగా 40వ ఓవర్‌లో వరుస బౌండరీలతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూమెంటమ్ కూడా మారిపోయింది.

కుర్రాళ్లకు గుణపాఠం..

కుర్రాళ్లకు గుణపాఠం..

ఇక్కడ ఆడటాన్ని మాత్రం ఆస్వాదించాం. ఈ మ్యాచ్‌ గెలిస్తే మరింత సంతోషం కలిగేది. కానీ ఆటలో గెలుపు ఓటములు సహజమే. జట్టులో ఉన్నది అంతా యువ ఆటగాళ్లే. వారికి ఈ ఓటమి మంచి గుణపాఠం. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో మేం మెరుగవ్వాల్సి ఉంది. మేం మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. బ్యాటింగ్‌లో కూడా కాస్త మెరుగ్గా రాణించాలి'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

అయ్యర్, ధావన్ రాణించినా..

అయ్యర్, ధావన్ రాణించినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

టామ్ లాథమ్ అజేయ సెంచరీ..

టామ్ లాథమ్ అజేయ సెంచరీ..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల వైఫల్యంతో గబ్బర్ సేన భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది.

Story first published: Friday, November 25, 2022, 16:25 [IST]
Other articles published on Nov 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X