For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ X యువరాజ్.. అసలు నిజం బయటపెట్టిన మాజీ చీఫ్ సెలెక్టర్!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్‌ను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాశనం చేశాడనే ప్రచారానికి మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ తెరదించాడు. ఏ రోజు కూడా యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించాలని ధోనీ కోరలేదని స్పష్టం చేశాడు. టీమ్ సెలెక్షన్‌లో ధోనీ జోక్యం కూడా చేసుకోలేదని పేర్కొన్నాడు. అంతేకాకుంగా గంభీర్‌ తనకున్న విభేదాలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తరుచూ.. ధోనీ వల్లే తన కొడుకు కెరీర్ నాశనమైందని ఆరోపిస్తుంటాడు. తన జీవితంలో ఎప్పటికీ ధోనీని క్షమించనని కూడా యోగ్ రాజ్ సింగ్ ఇటీవల ప్రకటించారు. దాంతో యువీ కెరీర్‌కు ధోనీనే ఎండ్ కార్డ్ వేసాడని సిక్సర్ల సింగ్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ఆరోపణల్లో నిజం లేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ సందీప్ పటేల్ తెలిపాడు.

ధోనీ ఎప్పుడూ చెప్పలేదు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. యోగ్‌రాజ్ ఆరోపణల్లో నిజం లేదన్నాడు. 'యువరాజ్ సింగ్‌ను తప్పించాలని ధోనీ ఏ రోజు కూడా అడగలేదు. సెలెక్షన్ కమిటీ సమావేశంలోనైనా.. విదేశీ పర్యటనల సందర్భంగానైనా.. మ్యాచ్‌ల సమంలోనైనా యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించమని ధోనీ ఎప్పుడూ అడగలేదు. టీమ్ సెలెక్షన్‌లో ధోనీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. జట్టు ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీపై ధోనీకి పూర్తి నమ్మకం ఉండేది. యోగ్‌రాజ్ ఒక తండ్రిగా కొడుకు పట్ల అభిమానం చూపించడం సహజమే అయినా.. ధోనీని నిందించడం సరికాదు.’అని సందీప్ పాటిల్ స్పష్టం చేశాడు.

గంభీర్ మాట్లాడటం మానేశాడు..

ఇదే ఇంటర్వ్యూలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో తనకు ఉన్న విభేదాల గురించి కూడా సందీప్ పాటిల్ వెల్లడిచాడు. తాను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నప్పుడే గంభీర్‌ను తప్పించి శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. ఈ నిర్ణయానికి ముందు గంభీర్‌ తనతో చాలా సన్నిహితంగా ఉండేవాడని, ఆ తర్వాత మాట్లాడటమే మానేశాడని వెల్లడించాడు.

టీవీ కార్యక్రమాల్లో కలిసినా తన ముఖం కూడా చూడకపోయేవాడని, పలకరించినా బదులిచ్చేవాడు కాదని పాటిల్ పేర్కొన్నాడు. గంభీర్ ఏ విషయాన్ని అంత త్వరగా మర్చిపోడని, ఎవర్నీ క్షమించడని పాటీల్ చెప్పుకొచ్చాడు. తనతో మాట్లాడకపోయినా.. గంభీర్‌పై తనకు గౌరవం ఉందని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, March 12, 2026, 13:47 [IST]
Other articles published on Mar 12, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+