IPL 2026 సీజన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 28న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవబోతుంది. ఇప్పటికే బీసీసీఐ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌ను ప్రకటించగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌తో ధనాధాన్ లీగ్ మొదలవ్వనుంది.
షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఈ వరల్డ్ రిచెస్ట్ లీగ్‌పై తీవ్ర చర్చ జరుగుతుంది. 10 జట్ల బలాలు, బలహీనతలతో పాటు టైటిల్ గెలిచే అవకాశాలను ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు మాజీ క్రికెటర్లు తమ సూటి పోటీ మాటలతో ఈ హైప్‌ను డబుల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో పది జట్లలోని ప్రధాన బ్యాటర్లు తమ బ్యాట్‌లకు పని చెప్పడానికి రెడీగా ఉన్నారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్ వంటి దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించేందుకు తహతహలాడుతున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రతీ జట్టులోని టాప్-4 బ్యాటర్లపై ఓ లుక్కెద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్లు సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రెవిస్. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సౌతాఫ్రికా స్టార్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రుతురాజ్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటగా.. ఆయుష్ మాత్రే అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడు.
ఆర్‌సీబీలో డేంజరస్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ కనబర్చాడు. అయితే ఫిల్ సాల్ట్ మాత్రం టీ20 ప్రపంచకప్‌లో నిరాశపర్చాడు. 8 మ్యాచ్‌ల్లో 16.25 సగటుతో 130 పరుగులు చేశాడు. అయితే అతనికి బ్యాకప్ ఓపెనర్ డేంజరస్ జాకోబ్ బెతెల్ ఉన్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ టాప్-4 బ్యాటర్లు.. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్. జైస్వాల్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కకపోగా.. వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడు. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్‌లో నామమాత్ర ప్రదర్శనే చేశారు.
4. గుజరాత్ టైటాన్స్..
గుజరాత్ టైటాన్స్‌లో డేంజరస్ బ్యాటర్లు.. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారుఖ్ ఖాన్. టీ20 ఫార్మాట్‌లో గిల్ తడబడగా... సాయి సుదర్శన్ గాయం నుంచి ఇటీవలే కోలుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో జోస్ బట్లర్ తేలిపోయాడు. పేలవ ఫామ్‌తో ఇంగ్లండ్ ఓటమికి కారణమయ్యాడు. షారుఖ్ ఖాన్ కూడా పెద్దగా పరుగులు చేసింది లేదు.
ముంబై ఇండియన్స్‌లో ప్రమాదకర బ్యాటర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. గత కొన్ని సీజన్లు రోహిత్ ఆడిందేం లేదు. కానీ ఇటీవల అతను బరువు తగ్గి ఫిట్‌గా మారాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్‌లో డికాక్, తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. అయితే ప్లేయర్‌గా ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను స్వేచ్చగా చెలరేగే అవకాశం ఉంది.
కేకేఆర్‌లో టాప్-4 బ్యాటర్లు ఫిన్ అలెన్, అజింక్యా రహానే, అంగ్‌కిష్, కామెరూన్ గ్రీన్. ఫిన్ అలెన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. అజింక్యా రహానే, రఘువంశీ, గ్రీన్ గొప్ప ఫామ్‌లో లేరు. ఐపీఎల్‌లో చెలరేగే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో ప్రమాదకర బ్యాటర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్. నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్. రాహుల్ టీ20 ఫార్మాట్ ఆడక చాలా రోజులు అవుతుంది. అభిషేక్ పోరెల్, నితీష్ రాణా దేశవాళీ క్రికెట్‌లో గొప్ప ఫామ్‌లో లేరు. సౌతాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదనిపించాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌లో డేంజరస్ బ్యాటర్లు మిచెల్ మార్ష్, మార్క్‌రమ్, నికోలస్ పూరన్. రిషభ్ పంత్. మార్ష్, మార్క్‌రమ్ టీ20 ప్రపంచకప్ 2026లో అదరగొట్టారు. ముఖ్యంగా మార్క్‌రమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత టీ20 జట్టుకు దూరమైన రిషభ్ పంత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు ఈ సీజన్ వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. తనదైన రోజు పూరన్ ఎలా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ప్రమాదకర బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరల్డ్ నెంబర్ 1, 2 టీ20 బ్యాటర్లుగా ఉన్నారు. మెగా టోర్నీలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ ఐపీఎల్ 2026లో అతను చెలరేగే అవకాశం ఉంది. హెన్రీచ్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పంజాబ్ కింగ్స్‌లో పవర్ ఫుల్ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా. ఈ నలుగురు మంచి ఫామ్‌లో ఉన్నారు.